Diwali 2024: ఈ దేశాల్లో దీపావళి వెరీ వెరీ స్పెషల్.. ఏయే దేశాలు వెలుగుల పండగను జరుపుకుంటాయంటే..

భారతదేశంలోనే కాదు ఈ దేశాలలో కూడా హిందువుల పవిత్ర పండుగలలో ఒకటైన దీపావళిని అద్భుతమైన రీతిలో జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. చాలా మంది ఈ పండుగను భారతదేశంలో మాత్రమే జరుపుకుంటారని అనుకుంటారు. అయితే వెలుగుల పండుగ అయిన దీపావళిని భారతదేశంలోనే కాకుండా మరికొన్ని దేశాల్లో కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలా దీపావళి పండుగను ఏయే దేశాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటాయో ఈ రోజు తెలుసుకుందాం..

Diwali 2024: ఈ దేశాల్లో దీపావళి వెరీ వెరీ స్పెషల్.. ఏయే దేశాలు వెలుగుల పండగను జరుపుకుంటాయంటే..
Diwali Celebrations In The World
Follow us
Surya Kala

|

Updated on: Oct 28, 2024 | 12:42 PM

వెలుగుల పండుగ దీపావళికి మరి మూడు రోజులే మిగిలి ఉన్నాయి. దీపావళి పండగ సందడి ఇప్పటికే దేశ వ్యాప్తంగా నెలకొంది. దీపావళి రోజున ఇంట్లో దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచి, పటాకులు పేల్చి ఈ దీపాల పండుగను జరుపుకుంటారు. మన భారతదేశంలో హిందువులు మాత్రమే కాదు ఇతర దేశాల్లో నివసిస్తున్న హిందువులు ఈ పవిత్ర పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మన దేశంలో పాటు మరి కొన్ని దేశాల్లో ఈ పండుగను కూడా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలా దీపావళి పండుగను ఏయే దేశాలు ఘనంగా జరుపుకుంటాయో చూద్దాం.

దీపావళిని ఘనంగా జరుపుకునే భారతదేశం వంటి దేశాలు:

నేపాల్: దీపావళి పండుగను నేపాల్‌లో తీహార్‌గా జరుపుకుంటారు. ఐదు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో వివిధ దేవతలను పూజించడంతోపాటు జంతువులను కూడా పూజిస్తారు. ఈ పండుగలో ఐదు రోజుల పాటు కుటుంబ సభ్యులంతా కలిసి పూలతో, దీపాలతో, కొవ్వొత్తులతో ఇళ్లను అలంకరిస్తారు.

ఇవి కూడా చదవండి

మలేషియా: దీపావళి పండుగను భారతదేశంలో పాటు మలేషియాలో కూడా జరుపుకుంటారు. ఇక్కడ ఈ పండుగను “హరి దీపావళి”గా జరుపుకుంటారు. దీపాల పండుగ సందర్భంగా ప్రతి వీధి, ప్రతి ఇంటిని లైట్లు, రంగురంగుల వస్తువులతో అలంకరిస్తారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. అంతేకాదు మలేషియన్లు ఈ పవిత్రమైన రోజున భారతీయ సాంప్రదాయ వంటకాలను ఆనందిస్తారు. విశేషమేమిటంటే ఈ పండుగ రోజున దేశ ప్రజలకు సెలవు దినం.

శ్రీలంక: భారతదేశ పొరుగు దేశం శ్రీలంకలో కూడా దీపావళిని ఘనంగా జరుపుకుంటుంది. రావణుడిపై రాముడు సాధించిన విజయానికి ప్రతీకగాకాదు… చెడుపై మంచి సాధించిన విజయోత్సవ వేడుకగా ఇక్కడి తమిళులు పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో దీపాలు , కొవ్వొత్తులను వెలిగిస్తారు.

అమెరికా: అమెరికాలో ఎక్కువ మంది భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. వీరు ప్రతి సంవత్సరం దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. అలాగే హిందువుల మత విశ్వాసాన్ని గౌరవించేందుకు అమెరికాలో దీపావళి జాతీయ సెలవుదినంగా ప్రకటించారు. దీపావళిని హిందువులే కాకుండా అమెరికాలోని ఇతర వర్గాలు కూడా జరుపుకుంటారు. అమెరికాలోని వైట్ హౌస్ దగ్గర దీపావళికి సంబంధించిన ఈవెంట్‌లు కూడా నిర్వహిస్తారు.

సింగపూర్: సింగపూర్‌లో కూడా భారతీయ సంతతికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ కూడా దీపావళి వేడుకలు జోరుగా సాగుతాయి. దీపాల పండుగ సందర్భంగా ఇక్కడ ప్రజలకు సెలవులు కూడా ఉంటాయి. సింగపూర్‌లో లిటిల్ ఇండియా అని పిలువబడే ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ భారతీయులందరూ దీపాలు వెలిగించి, పటాకులు పేల్చకుండా స్వీట్లు పంచి పండుగను జరుపుకుంటారు.

మారిషస్: భారతదేశం వలె మారిషస్‌లో దీపావళిని చాలా వైభవంగా జరుపుకుంటారు. మారిషస్ సంస్కృతిలో భారతదేశం ప్రభావం అపారమైనది. హిందూ పండుగ దీపావళిని కూడా ఈ ద్వీపంలో గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఇది కాకుండా ఇక్కడ ప్రజలు హోలీ. మహా శివరాత్రి పండుగలను కూడా జరుపుకుంటారు.

యునైటెడ్ కింగ్‌డమ్: ఇంగ్లండ్‌లోని లీసెస్టర్ నగరంలో కూడా దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడ దీపాల పండుగ సందర్భంగా నగరమంతా దీపాలతో అలంకరిస్తారు. దీపావళి పండుగ రోజున ఇక్కడ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాలోని సిడ్నీ , మెల్బోర్న్ నగరాల్లో నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీ కలిసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. భారతీయ వంటకాలను తయారు చేయడం ద్వారా దీపాల పండుగను లా ప్రత్యేకమైన రీతిలో జరుపుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)