AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2024: దీపావళికి కలలో ఈ వస్తువులు కనిపించడం శుభప్రదం.. ఏ వస్తువులు వేటిని సూచిస్తాయంటే

కలలు మన జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం దీపావళి రాత్రి వచ్చే కొన్ని కలలు లక్ష్మీదేవి అనుగ్రహానికి.. చిహ్నం అట. లక్ష్మీదేవి ఆశీర్వాదాలు వ్యక్తిపై కురుస్తాయని సూచిస్తున్నాయి. దీపావళి రోజు రాత్రి ఎటువంటి కలలు రావడం శుభసూచకం అంటే.. ఆ కలలు ఏవో తెలుసుకుందాం.

Diwali 2024: దీపావళికి కలలో ఈ వస్తువులు కనిపించడం శుభప్రదం.. ఏ వస్తువులు వేటిని సూచిస్తాయంటే
Swapna Shastram
Surya Kala
|

Updated on: Oct 29, 2024 | 11:15 AM

Share

హిందూ మతంలో దీపావళి పండుగ చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ పండుగలలో ఒకటి. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దీపావళి ఉత్సాహంగా జరుపుకుంటారు. ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగ ధన త్రయోదశి పండుగతో ప్రారంభమవుతుంది. దీపావళి పండుగ ఆనందం, శోభ, శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. ఈ రోజున, లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తి శ్రద్దలతో పూజిస్తారు.

దీపావళి రోజు రాత్రి చేసే పూజలకు భక్తికి సంతోషించిన లక్ష్మీదేవి వారి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. అందుకే దీపావళి రాత్రి లక్ష్మీ దేవిని స్వాగతించడానికి ప్రజలు అనేక చర్యలు తీసుకుంటారు. కలల శాస్త్రం ప్రకారం అన్ని కలలకు ఖచ్చితంగా కొంత అర్థం ఉంటుంది. దీపావళి పండుగ రోజున లేదా ఆ సమయంలో వచ్చే కలలను ప్రత్యేకంగా పరిగణిస్తారు. దీపావళి సందర్భంగా వచ్చే కొన్ని శుభ కలల గురించి.. ఈ కలలు దేనిని సూచిస్తాయో తెలుసుకుందాం..

కలలో లక్ష్మీదేవిని చూడడం

స్వప్న శాస్త్రం ప్రకారం దీపావళి రోజున కలలో లక్ష్మీదేవిని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కల లక్ష్మీ దేవి మీ పట్ల సంతోషంగా ఉందని.. లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై కురుస్తాయని సూచిస్తుంది. ఈ కల కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో సంతోషం, కీర్తి , ఐశ్వర్యం రాబోతుందని సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

అమృత కలశం

స్వప్న శాస్త్రం ప్రకారం దీపావళి రోజున కలలో అమృత కలశాన్ని అంటే అమృతంతో నిండిన కుండ కనిపించడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కుటుంబంలో ఎవరైనా దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉంటే.. వారు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని, ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఈ కల సూచిస్తుంది. లక్ష్మిదేవి ఆశీస్సులు మీ వెంటే ఉంటాయని అర్ధం.

తామర పువ్వు కనిపిస్తే

స్వప్న శాస్త్రం ప్రకారం దీపావళి రోజు కలలో తామర పువ్వును చూడటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కల వ్యాపారం, ఉద్యోగంలో వచ్చే లాభాలను సూచిస్తుంది. ఈ కల ఆర్థిక లాభం, పురోగతికి సూచికగా కూడా పరిగణించబడుతుంది.

గోధుమ లేదా వరి పంటను చూడడం

స్వప్న శాస్త్రం ప్రకారం దీపావళి రాత్రి కలలో గోధుమ లేదా వరి పంటను చూడటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కల జీవితంలోని చెడు సమయం త్వరలో ముగిసి..త్వరలో మంచి సమయం రానున్నదని సూచిస్తుంది. ఈ కల త్వరలో రానున్న ఆర్థిక లాభాలను కూడా సూచిస్తుంది.

కుల దైవం కనిపిస్తే

డ్రీమ్ సైన్స్ ప్రకారం దీపావళి రోజున కలలో కుల దైవం కనిపిస్తే ఈ కలకు అర్ధం చిరకాల కోరికలు లేదా కోరికలు త్వరలో నెరవేరబోతున్నాయని సూచిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి త్వరలో ఉద్యోగం వస్తుందనడానికి ఈ కల సంకేతమట.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)