Konaseema: వైభవంగా వాడపల్లి బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వాహన సేవలు.. భారీ సంఖ్యలో భక్తులు హాజరు
కోనసీమ తిరుమల వాడపల్లి బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. శ్రీవేంకటేశ్వరస్వామి 12 వ వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 21 నుంచి 29వ తేదీ ఈరోజు చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి. తిరుమల తరహాలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు.. యాగశాలలో ప్రత్యేక హోమాలతో పాటు, వసంత మండపంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.