ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఎన్నో విషయాలను ప్రస్తావించాడు.. వ్యక్తిగత జీవితం నుంచి వివాహ జీవితం వరకు.. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా వివరించాడు.. వివాహానంతరం భర్తతో పోలిస్తే భార్య బాధ్యత చాలా రెట్లు పెరుగుతుంది.. భార్య సద్గుణవంతురాలైతే ఆమె తన మొత్తం కుటుంబాన్ని కాపాడుతుంది. ఆమె వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి ప్రశాంతత ఉంటుందని ఆచార్య చాణక్యుడు తన గ్రంధాలలో అంటే చాణక్య నీతిలో బోధించాడు.. కానీ ఈ గ్రంథాలలో, ఆచార్య చాణక్యుడు భార్యకు సంబంధించిన మూడు అలవాట్లను ప్రస్తావించాడు.. ఈ అలవాట్లు అస్సలు ఉండకూడదని చెప్పాడు.. ఏ స్త్రీకైనా ఈ అలవాట్లు కలిగి ఉంటే.. ఆమె తన భర్తను ఎంతగా ప్రేమించినా.. ఇల్లు నాశనం అవుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.