AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధన త్రయోదశి రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకోండి

జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ధన త్రయోదశి రోజున జరుపుకుంటారు. ఈ వేడుక 2016లో ప్రారంభించబడింది. అయితే ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే దీని గురించి తెలుసు. కనుక ఈసారి జాతీయ ఆయుర్వేద దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత, వీటి ఆధారంగా ఈ ఏడాది థీమ్ గురించి తెలుసుకుందాం.

ధన త్రయోదశి రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకోండి
National Ayurveda Day
Surya Kala
|

Updated on: Oct 29, 2024 | 9:01 AM

Share

ఆయుర్వేద చరిత్ర సుమారు 5000 సంవత్సరాల నాటిది. ఈ పదానికి ‘జీవిత శాస్త్రం’ అని అర్ధం. ఆయుర్వేదం కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, వ్యాధుల చికిత్సపై దృష్టి పెడుతుంది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎలా జీవించాలో కూడా బోధిస్తుంది. ఆయుర్వేద దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ధన త్రయోదశి రోజున జరుపుకుంటారు. ఆయుర్వేదంలో వ్యాధులకు చికిత్స చేయడమే కాకుండా, వ్యాధికి ప్రధాన కారణాలను గుర్తించి దానిని తొలగించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇందులో ఔషధాల వినియోగం, ఆహారం, యోగా, ఏకాగ్రత వంటి అంశాలు ఉంటాయి. ఆయుర్వేదం మూడు ప్రధాన దోషాల సూత్రంపై ఆధారపడి ఉంటుంది. వాత, పిత్త, కఫం శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి.

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి తిథి రోజున ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు. ఈసారి ఈ పండుగను అక్టోబర్ 29న అంటే ఈరోజు జరుపుకుంటున్నారు. దీనితో పాటు నేడు జాతీయ ఆయుర్వేద దినోత్సవం కూడా. అయితే ప్రతి సంవత్సరం ఈ రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక కారణం ఏమిటి?

జాతీయ ఆయుర్వేద దినోత్సవం జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ధన త్రయోదశి రోజున జరుపుకుంటారు. ఎందుకంటే ఈ రోజును భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా హిందూ వైద్య దేవుడైన ధన్వంతరి పుట్టినరోజుగా జరుపుకుంటారు. విశ్వాసాల ప్రకారం ధన్వంతరి ఆయుర్వేద దేవుడు అని చెప్పబడింది.

ఇవి కూడా చదవండి

జాతీయ ఆయుర్వేద దినోత్సవం చరిత్ర

2016లో భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ భగవంతుడు ధన్వంతరికి జయంతిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. మొదటి ఆయుర్వేద దినోత్సవాన్ని 28 అక్టోబర్ 2016న జరుపుకున్నారు. అప్పటి నుండి జాతీయ ఆయుర్వేద దినోత్సవం ప్రతి సంవత్సరం భగవాన్ ధన్వంతి జయంతిని ధన త్రయోదశి రోజున జరుపుకుంటారు.

ఈ సారి థీమ్ ఏమిటంటే?

ఈరోజు అంటే అక్టోబర్ 29న 9వ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్‌తో జరుపుకుంటారు. ఈసారి ప్రపంచ ఆరోగ్యానికి ఆయుర్వేద ఆవిష్కరణల నేపథ్యంతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కళాశాలలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం వంటి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడమే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రధాన లక్ష్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..