Naga Chaitanya: నాగ చైతన్య- శోభిత పెళ్లి ముహూర్తం ఫిక్స్‌! సామ్‌తో ఆ చివరి జ్ఞాపకాన్ని కూడా చెరిపేసిన చైతూ!

టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ ప్రేమ పక్షులు త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం.ఇటీవలే శోభిత ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం కూడా అట్టహాసంగా జరిగింది.

Naga Chaitanya: నాగ చైతన్య- శోభిత పెళ్లి ముహూర్తం ఫిక్స్‌! సామ్‌తో ఆ చివరి జ్ఞాపకాన్ని కూడా చెరిపేసిన చైతూ!
Naga Chaitanya, Sobhita Dhulipala
Follow us
Basha Shek

|

Updated on: Oct 27, 2024 | 9:22 PM

అక్కినేని హీరో నాగచైతన్య త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టునున్నాడు. సమంతతో విడాకుల అనంతరం హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తో ప్రేమలో పడిన ఈ హ్యాండ్సమ్ హీరో ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ లోనే నాగ చైతన్య, శోభితలు మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎంగేజ్ మెంట్ తర్వాత తమ సినిమా పనుల్లో బిజీ అయిపోయిన ఈ లవ్ బర్డ్స్ తొలిసారిగా జంటగా కనిపించారు. ఇక శోభిత ఇంట్లోనూ పసుపు దంచే కార్యక్రమం కూడా అట్టహాసంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభిత. దీంతో ఆ ఫోటోలు నెట్టింట బాగా వైరల్‌గా మారాయి. కాగా సామ్ తో విడాకుల అనంతరం ఆమెతో ఉన్న జ్ఞాపకాలను చెరిపేశాడు నాగ చైతన్య. తన సోషల్ మీడియా ఖాతాల్లో సామ్ తో కలిసున్న ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు. అయితే ఒక్క ఫొటో మాత్రం డిలీట్ చేయకుండా అలాగే వదిలేశాడు. అందులో విడాకులకు సంబంధించిన పోస్ట్ తో పాటు 2018లో మజిలీ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా సమంతతో కలిసి రేస్ ట్రాక్‌పై తీసిన ఫొటో కూడా ఉంది. దీనికి ‘బ్యాక్ త్రో …మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్’ అని క్యాప్షన్‌ ఉంది.

అయితే తాజాగా ఆ ఫోటోను కూడా నాగ చైతన్య తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. శోభితతో ఎంగేజ్‌మెంట్ తర్వాత కూడా ఈ ఫొటోను అలాగే ఉంచడంతో సమంత అభిమానులు ఫీలయ్యారు. వెంటనే ఈ ఫొటోను కూడా డిలీట్ చేయాలంటూ చైతన్యను కోరారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య సమంత ఫొటోను, పోస్ట్ ను తొలగించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

శోభిత ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలు..

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తండేల్ చిత్రంలో నటిస్తున్నాడు నాగ చైతన్య. డైరెక్టర్ చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

నాగ చైతన్యతో శోభిత..

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం