‘దంగల్’కు రూ. 2 వేల కోట్లు వసూళ్లు.. ఫోగట్ ఫ్యామిలీకి దక్కిందెంతో తెలుసా ??
మల్ల యోధుడు మహావీర్ సింగ్ ఫోగట్, ఆయన కుమార్తెలు బబితా ఫోగట్, గీతా ఫోగట్ జీవిత కథ ఆధారంగా గతంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'దంగల్'. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలైన తర్వాత బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది ఏకంగా రూ. 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని సమాచారం.
అయితే, ఈ సినిమాకు స్ఫూర్తిగా నిలిచిన బబితా ఫోగట్ తాజాగా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన బబిత తాజాగా ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దంగల్ సినిమా మేకర్స్ నుంచి తమ కుటుంబానికి అందిన ఆర్థిక వివరాలను ఆమె తెలిపారు. తన కుటుంబానికి మేకర్స్ నుంచి కేవలం రూ. 1 కోటి మాత్రమే అందాయని ఆమె తెలిపారు. “దంగల్ సినిమాకు వచ్చిన రూ. 2,000 కోట్లలో ఫోగట్ కుటుంబానికి కేవలం రూ. 1 కోటి మాత్రమే వచ్చింది” అని న్యూస్ 24కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బబితా వెల్లడించారు. అయితే, ఇంత తక్కువ మొత్తం దక్కినందుకు మీకు బాధగా అనిపించలేదా? అని అడిగిన మరో ప్రశ్నకు బబిత తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తన కుటుంబం ఉద్దేశం ఈ మూవీ నుంచి డబ్బు ఆశించడం కాదన్నారు. ప్రజల నుంచి గౌరవం, ప్రేమను సంపాదించడం మాత్రమేనని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
BSNL: దూకుడు పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్.. అదిరిపోయే రీఛార్జ్ ఆఫర్
అర్ధరాత్రి నడిరోడ్డుపై వింత ఆకారం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు
ఓవైపు భర్త మరణం, మరోవైపు కుమారుడి జననం
హమ్మయ్యా.. ఇక స్పామ్ కాల్స్‌కు చెక్ పడినట్టే !!
విద్యార్థులకు శుభవార్త !! ఆ సబ్జెక్టుల్లో 20 మార్కులు వచ్చినా పాస్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

