అర్ధరాత్రి నడిరోడ్డుపై వింత ఆకారం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు

అర్ధరాత్రి నడిరోడ్డుపై వింత ఆకారం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు

Phani CH

|

Updated on: Oct 28, 2024 | 8:26 PM

పల్నాడు జిల్లాలో బైపాస్‌ రోడ్డుపై మొసలి కలకలం రేపింది. రాత్రి సమయంలో వాహనాలకు అడ్డంగా రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. పిడుగురాళ్ల బైపాస్ పిల్లుట్ల జంక్షన్ సమీపంలో మొసలి రోడ్డుపై తిరుగాడుతూ స్థానికులు, వాహనదారులను భయాందోళనకు గురిచేసింది. పిడుగురాళ్లలోని రిక్షా కాలనీకి సమీపంలో చిన్నచిన్న కాల్వలు, క్వారీ గుంతలు ఉన్నాయి.

అక్కడే ఈ మొసలి నివాసం ఏర్పచుకుని ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచే బయటకు వచ్చి ఉంటుందని చెబుతున్నారు. ఆహారం వెతుక్కునే క్రమంలో పక్కనే ఉన్న పంటపొలాల్లోనుంచి ఇలా రోడ్డుపైకి వచ్చి ఉంటుందని అంటున్నారు. మొసలి సంచారంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు అటవీశాఖ అధికారులు బైపాస్‌ రోడ్డు వద్దకు వెళ్లారు. ఇంతలోనే అందరూ చూస్తుండగానే ఆ మొసలి పంటపొలాల్లోనుంచి మడుగులోకి వెళ్లిపోయింది. అయితే మొసలు ఎటు వెళ్లిందోననే అనుమానంతో రాత్రంతా వెతికినప్పటికీ మొసలి కనపడలేదు. దీంతో మొసలి కోసం ప్రత్యేకంగా ట్రాప్‌ కేసు ఏర్పాటు చేశారు అటవీ సిబ్బంది. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, కృష్ణా నది బ్యాక్ వాటర్ నుండి పిల్లుట్ల వాగులోకి మొసళ్ళ సంచరిస్తుంటాయని అటవీ అధికారులు తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓవైపు భర్త మరణం, మరోవైపు కుమారుడి జననం

హమ్మయ్యా.. ఇక స్పామ్‌ కాల్స్‌కు చెక్ పడినట్టే !!

విద్యార్థులకు శుభవార్త !! ఆ సబ్జెక్టుల్లో 20 మార్కులు వచ్చినా పాస్‌

Published on: Oct 28, 2024 08:07 PM