హమ్మయ్యా.. ఇక స్పామ్‌ కాల్స్‌కు చెక్ పడినట్టే !!

హమ్మయ్యా.. ఇక స్పామ్‌ కాల్స్‌కు చెక్ పడినట్టే !!

|

Updated on: Oct 28, 2024 | 7:49 PM

భారతీయ ఫోన్ నెంబర్‌లకు వచ్చే అంతర్జాతీయ కాల్స్‌ను బ్లాక్ చేయడానికి కొత్త స్పామ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను కేంద్రం తాజాగా ప్రకటించింది. సిస్టమ్ యాక్టివేట్‌ అయిన 24 గంటలలోపే 1.35 కోట్ల అంతర్జాతీయ కాల్స్‌ను స్పామ్‌ కాల్స్‌గా గుర్తించింది. ‘ఇంటర్నేషనల్ ఇన్‌కమింగ్ స్పూఫ్డ్‌ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్’ను ప్రారంభించిన కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా..

సైబర్ నేరాల నుండి ప్రజలను రక్షించడం కోసం ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నం ఇది అన్నారు. సైబర్ నేరగాళ్లు భారతీయ మొబైల్ నెంబర్ +91ను వాడుతూ అంతర్జాతీయ ఫేక్‌ కాల్స్‌ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ కాల్స్‌ భారతదేశం నుండే వస్తున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి విదేశాల నుండి చేస్తున్నారని మంత్రి అన్నారు. ప్రభుత్వ అధికారుల మాదిరిగా మాట్లాడటం, వినియోగదారుల పూర్తి వివరాలు సేకరించి మోసాలకు పాల్పడ్డారనీ కేంద్ర మంత్రి అన్నారు. మొబైల్ నెంబర్‌ను బ్లాక్ చేస్తామని బెదిరించడం, నకిలీ డిజిటల్ అరెస్ట్‌లు, కొరియర్‌లో డ్రగ్స్ కట్టుకథలు, పోలీసు అధికారులను అనుకరిస్తూ మోసాలు, సెక్స్ రాకెట్‌లో అరెస్ట్ కేసులు లాంటివి వెలుగులోకి వచ్చాయన్నారు. అయితే వాళ్లు ఇతర మార్గాల ద్వారా కూడా మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సంచార్ సాథీలోని చక్ష్ ఫీచర్‌లో మోసపూరిత కాల్స్‌ పై ఫిర్యాదు చేయడం ద్వారా వినియోగదారులు.. సహాయం పొందవచ్చని తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విద్యార్థులకు శుభవార్త !! ఆ సబ్జెక్టుల్లో 20 మార్కులు వచ్చినా పాస్‌

Follow us