మీ పాత ఫోన్‌ను అపరిచితులకు అమ్మేస్తున్నారా ??
మీ పాత ఫోన్ అమ్మేస్తున్నారా? ఎక్సేంజ్ కింద కొత్త ఫోన్ కొనేస్తున్నారా? ఆగండాగండీ.. ఈ ముచ్చట తెలుసుకుని అప్పుడు అమ్మేయండి. పాత సెల్‌ఫోన్‌ను తెలియని వారికి విక్రయిస్తే చికుల్లో పడే అవకాశాలున్నాయని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాత మొబైల్ ఫోన్లను కొని వాటితో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వరసగా వెలుగు చూస్తున్నాయని హెచ్చరిస్తున్నారు.
గత ఆగస్టులో బిహార్‌కు చెందిన ఓ ముఠాను రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి ఏకంగా 4,000కు పైగా సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముఠాను విచారించడంతో ఎన్నో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఇటీవల తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన రాజస్థాన్ ముఠాకు, ఈ పాతఫోన్లు కొని, వారికి విక్రయించే ముఠాలకు సంబంధం ఉన్నట్టు తేలింది. ఈ పాత సెల్ ఫోన్లు కొనుగోలు చేస్తున్న ముఠాలు కిలోల లెక్కన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి.. అందులోని సమాచారాన్ని రిట్రీవ్ చేసి, అందులోని కాంటాక్ట్ నంబర్ల చొప్పున సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. గతంలో పట్టుబడిన ఈ ముఠా బిహార్‌లోని కతిహార్ జిల్లా రౌతారా ప్రాంతానికి చెందిన అక్తర్ అలీ సూచనతో పాత సెల్‌ఫోన్లు కొంటారు. తమ నుంచి కిలోల లెకన అక్తర్ వాటిని కొనుగోలు చేసి, కీలక సమాచారం సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఫోన్‌ను అమ్మేముందు డేటాను బ్యాక్‌అప్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతే కాదు సెల్‌ఫోన్‌లోని డేటాను ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ ద్వారా పూర్తిగా తొలగించాలి. అలా చేయడం వల్ల ఇతరులు మీ వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించి బ్లాక్‌మెయిల్ చేసేందుకు అవకాశం ఉండదు. అన్ని అకౌంట్ల నుంచి మీ ఫోన్‌ను డీరిజిస్టర్ చేయాలి. గూగుల్ అకౌంట్‌ను సైన్ అవుట్ చేయాలి. సెట్టింగ్స్‌లో యూజర్స్ అండ్ అకౌంట్స్ ఆప్షన్‌లోకి వెళ్లి రిమూవ్ అకౌంట్ బటన్‌ను క్లిక్ చేయాలి. ఇంత చేసినా కూడా పాత సెల్‌ఫోన్‌ను అపరిచితులకు విక్రయించొద్దు. కొనుగోలుదారు నేరుగా మిమ్మల్ని సంప్రదించాకే విక్రయించాలి. అవసరమైతే వారి అడ్రస్ ప్రూఫ్, ఫొటో, సెల్‌ఫోన్‌ను వారికి విక్రయించినట్టుగా సంతకం తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీరియళ్లు, సీనిమాలు చూసి ఏడుస్తున్నారా ?? అయితే మీకు..
ఇంతకీ దీపావళి ఏ రోజున జరుపుకోవాలి ??
‘దంగల్’కు రూ. 2 వేల కోట్లు వసూళ్లు.. ఫోగట్ ఫ్యామిలీకి దక్కిందెంతో తెలుసా ??
BSNL: దూకుడు పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్.. అదిరిపోయే రీఛార్జ్ ఆఫర్
అర్ధరాత్రి నడిరోడ్డుపై వింత ఆకారం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు