ఇంతకీ దీపావళి ఏ రోజున జరుపుకోవాలి ??

ఇంతకీ దీపావళి ఏ రోజున జరుపుకోవాలి ??

Phani CH

|

Updated on: Oct 28, 2024 | 8:30 PM

పండగలు వస్తున్నాయంటేనే కన్ఫ్యూజన్‌ స్టార్ట్‌ అవుతుంటుంది. ఏ రోజున ఏ ముహూర్తాన పండగ జరుపుకోవాలి వంటి సందేహాలు పుట్టుకొస్తాయి. ఇక మరికొద్ది రోజుల్లో రాబోతున్న దీపావళి పండగపై కూడా చాలా మంది అనుమానాలు ఉన్నాయి. ఏ రోజున దీపావళి జరుపుకోవాలి? క్యాలెండర్‌లో చూపించిన ముహూర్తం ఓకేనా అనే డౌట్లు ఉన్నాయి.

కొందరేమో అక్టోబర్ 31న అంటుండగా.. మరికొందరు నవంబర్ 1నే దీపావళి పండగ అని చెబుతున్నారు. మరి ఇందులో నిజమేంటి. అక్టోబర్ 31వ తేదీ గురువారం ఉదయం పూర్వం చతుర్దశి తిథి ఉన్నందున నరక చతుర్దశిగా, దీపావళి పండుగను జరుపుకోవచ్చు. మళ్ళీ ఇదే రోజు గురువారం సాయంకాలానికీ అమావాస్య తిథి ఉన్నందున ధనలక్ష్మి పూజలు ఆచరించవచ్చు. అంటే 31వ తేదీనే రెండు తిథులు ఉన్నందునా రెండు పండుగలు దీపావళి, ధనలక్ష్మిపూజలు ఒకే రోజు జరుపుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. సాధారణంగా దీపావళి పండుగను ఏటా అశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 31 మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాలకు అమావాస్య మొదలవుతుంది. ఈ అమావాస్య నవంబర్ 1 సాయంత్రం 6 గంటల 16 నిమిషాలకు ముగుస్తుంది. దాని తరువాత పాడ్యమి మొదలవుతుంది. దీంతో అక్టోబర్ 31నే పండగ జరుపుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘దంగ‌ల్’కు రూ. 2 వేల కోట్లు వసూళ్లు.. ఫోగ‌ట్ ఫ్యామిలీకి ద‌క్కిందెంతో తెలుసా ??

BSNL: దూకుడు పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. అదిరిపోయే రీఛార్జ్‌ ఆఫర్‌

అర్ధరాత్రి నడిరోడ్డుపై వింత ఆకారం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు

ఓవైపు భర్త మరణం, మరోవైపు కుమారుడి జననం

హమ్మయ్యా.. ఇక స్పామ్‌ కాల్స్‌కు చెక్ పడినట్టే !!