BSNL: దూకుడు పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్.. అదిరిపోయే రీఛార్జ్ ఆఫర్
కొన్ని నెలల క్రితం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచాయి. దీంతో అనేక మంది యూజర్లకు ప్రభుత్వ రంగ నెట్‌వర్క్ BSNL ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ అనేక ప్రాంతాల్లో 4జీ సేవలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో BSNL సంస్థకు జులైలో 29.4 లక్షలకు పైగా మొబైల్ వినియోగదారులు కొత్తగా చేరారు.
ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ లక్షల్లో కస్లమర్లను కోల్పోయాయి. ఈ క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ జోష్ పెంచింది. మరింతమంది కస్టమర్లను ఆకర్షించే దిశగా దూసుకుపోతోంది. అదిరిపోయే రీచార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తూ టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కు మారారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్ పెంచడంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇతర టెలికాం కంపెనీలతో పోల్చితే బీఎస్ఎన్ఎల్లో ప్లాన్ ల ఖరీదు చాలా తక్కువ. తాజాగా.. మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. నమ్మశక్యం కాని ధరలో 52 రోజుల చెల్లుబాటును ఈ ప్లాన్ అందిస్తోంది. BSNL కొత్తగా అందిస్తున్న రూ. 298 రీఛార్జ్ ప్లాన్ తో వినియోగదారులకు లాభం కలిగించేలా ఉంది. ఈ ప్లాన్ 52 రోజుల పాటు చెల్లుబాటుతో వస్తుంది. రీఛార్జ్ ఖర్చులపై ఇది గణనీయమైన పొదుపును అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఏదైనా నెట్‌వర్క్‌కి అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 100 ఉచిత SMSలు పంపుకోవచ్చు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి నడిరోడ్డుపై వింత ఆకారం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు
ఓవైపు భర్త మరణం, మరోవైపు కుమారుడి జననం
హమ్మయ్యా.. ఇక స్పామ్ కాల్స్‌కు చెక్ పడినట్టే !!
విద్యార్థులకు శుభవార్త !! ఆ సబ్జెక్టుల్లో 20 మార్కులు వచ్చినా పాస్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

