Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీరియళ్లు, సీనిమాలు చూసి ఏడుస్తున్నారా ?? అయితే మీకు..

సీరియళ్లు, సీనిమాలు చూసి ఏడుస్తున్నారా ?? అయితే మీకు..

Phani CH

|

Updated on: Oct 28, 2024 | 8:53 PM

సీరియళ్లు, సీనిమాల్లోని సెంటిమెంట్‌ సీన్స్‌ చూస్తే చాలామందికి ఏడుపు తన్నుకొస్తుంది. సినిమా కష్టాలు తమవి లాగానే భావించి ఏడుస్తుంటారు. అయ్యో ఏం కష్టమొచ్చిందే అని తమకు తెలియకుండాన కన్నీళ్లతో సానుభూతి ఒలకబోస్తుంటారు. అయితే సినిమాలు, సీరియల్లు చూసి ఏడ్చేవారి మీద అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయట.

అలాంటి వారిలో తిరస్కరణకు గురవుతామనే భయం, సాధారణ పరిస్థితులను సైతం ముప్పుగా భావించే ప్రమాదం ఉంటుందట. దీంతో వారికి అకాల మరణ ముప్పు ఎక్కువ ఉన్నట్టు అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. న్యూరోటిసిజంతో బాధపడుతున్న వారిలో ఇలాంటి ప్రవర్తనలు ఉంటాయని, వీరిలో అకాల మరణ ముప్పు 10 శాతం ఎక్కువ ఉంటుందని తేలింది. న్యూరోటిసిజం సమస్యతో బాధపడుతున్న యూకే బయోబ్యాంక్‌ డాటాలో ఉన్న ఐదు లక్షల మంది 17 ఏండ్ల జీవితాన్ని ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. న్యూరోటిసిజం కూడా దుఃఖం, భయం, చిరాకు వంటి ప్రతికూల భావోద్వేగాలకు సంబంధించినది. ఈ సమస్య ఉన్నవారిలో ఆందోళన, ఒంటరితనం, విరక్తి వంటివి ప్రధానంగా కనిపిస్తాయి. ఇవి మనిషి మెదడు, శరీరంపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఒంటరితనం వల్ల శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు పెరగడంతో పాటు తమకు తాము హాని తలపెట్టుకోవాలనే ఆలోచనలు పెరుగుతాయని తెలిపారు. న్యూరోటిసిజం ఎదుర్కొంటున్న వారిలో మూడ్‌ స్వింగ్స్‌, విసిగిపోయిన భావన కలుగుతాయని, ఇవి కూడా అకాల మరణ ముప్పును పెంచుతాయని పేర్కొన్నారు. న్యూరోటిసిజంలోని ఇతర సమస్యల కంటే ఒంటరితనం అనేది ఎక్కువగా ప్రభావం చూపుతున్నదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంతకీ దీపావళి ఏ రోజున జరుపుకోవాలి ??

‘దంగ‌ల్’కు రూ. 2 వేల కోట్లు వసూళ్లు.. ఫోగ‌ట్ ఫ్యామిలీకి ద‌క్కిందెంతో తెలుసా ??

BSNL: దూకుడు పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. అదిరిపోయే రీఛార్జ్‌ ఆఫర్‌

అర్ధరాత్రి నడిరోడ్డుపై వింత ఆకారం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు

ఓవైపు భర్త మరణం, మరోవైపు కుమారుడి జననం