Chiranjeevi: రచ్చ గెలిచి.. ఇంట గెలిచానేమో.. వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసిన చిరంజీవి
ఏఎన్‌ఆర్ అవార్డుల ఫంక్షన్‌లో టాలీవుడ్ వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి ఉద్వేగానికి లోనయ్యారు. నా విషయంలో రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను ఏమో అనిపిస్తోందన్నారు.
ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి ఉద్వేగానికి లోనయ్యారు. 17 ఏళ్ల నాటి తన మనసులోని బాధను బయటపెట్టారు. “తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. కానీ సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. అప్పుడు నాకు లెజండరీ పురస్కారం ప్రదానం చేశారు. ఆ సమయంలో చాలా ఆనందమేసి ధన్యుణ్ని అనుకున్నా. కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించని సమయంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే దాన్ని క్యాప్సుల్ బాక్సులో వేశా. ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్ అవార్డును… ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారి చేతులు మీదగా అందుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తోంది.. నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను అని అంటూ చిరంజీవి ఎమోషనల్‌గా మాట్లాడారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

