Thalapathy Vijay: ఒక్కొక్కరికీ సినిమా చూపించాడు.! ఫస్ట్ స్పీచ్ దద్దరిల్లిపోయింది..

Thalapathy Vijay: ఒక్కొక్కరికీ సినిమా చూపించాడు.! ఫస్ట్ స్పీచ్ దద్దరిల్లిపోయింది..

Anil kumar poka

|

Updated on: Oct 29, 2024 | 9:49 AM

తమిళగ వెట్రిక్‌ కళగం పార్టీ పేరుతో పొలిటికల్‌ అరంగేట్రం చేశారు..తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్‌. ఇప్పటికే పార్టీ పేరు, జెండా ప్రకటించిన విజయ్..తొలి బహిరంగ సభను గ్రాండ్‌గా నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురం వేదికగా జరిగిన సభకు..లక్షల సంఖ్యల అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ముందుగానే ప్రకటించినప్పటికీ..అభిమానాలు మాత్రం ఉదయం నుండి సభా ప్రాంగణానికి వేలాదిగా తరలివచ్చారు.

తమిళగ వెట్రిక్‌ కళగం పార్టీ పేరుతో పొలిటికల్‌ అరంగేట్రం చేసిన తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్‌.  అన్నట్టుగానే సాయంత్రం నాలుగు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు విజయ్. 800 మీటర్ల పొడవైన ర్యాంప్‌పై సింగిల్‌గా వాక్‌ చేస్తూ..అభిమానులకు అభివాదం చేశారు. అభిమానులు స్టేజ్ మీదకు విసిరిన కండువాలను తన భుజాన వేసుకుని వారిని ఆనందపర్చారు..ఇళయ దళపతి.

మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటినుంచే పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు విజయ్ సన్నాహాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే మహానాడు పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. పార్టీ ఏర్పాటు చేసిన ఉద్దేశంతో పాటు తన పార్టీ సిద్ధాంతాలు, వచ్చే ఎన్నికల్లో తన అజెండాపై ఈ మహానాడు వేదికపైనుండి ప్రజలకు స్పష్టత ఇచ్చారు విజయ్. తన మేనియా ఏంటో మరోసారి తన అపొనెంట్స్‌కు సినిమా వేసి మరీ చూపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.