Rohit Shetty: యంగ్ హీరోలు బాలీవుడ్‌ను నాశనం చేస్తున్నారు.. పద్దతి మార్చుకోకుంటే అంతే.!
రోహిత్ షెట్టి! బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్. యాక్షన్ అండ్ కామెడీ కలబోతలో సినిమాలు చేస్తూ.. సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్. అలాంటి ఈ స్టార్ డైరెక్టర్ .. ఇప్పుడు కాంట్రో కామెంట్స్ చేశారు. కొత్త హీరోల వల్లే సినిమా ఇండస్ట్రీ నాశనమైందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటాడు రోహిత్ శెట్టి..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాత్రం స్టార్ డైరెక్టర్ రోహిత్ షెట్టి.. బాలీవుడ్ యంగ్ హీరోలపై కాస్త అసహనం వ్యక్తం చేశాడు. కొత్త హీరోల వల్ల సినీపరిశ్రమ చెడిపోతోందని.. వారే ఇండస్ట్రీని చెడగొట్టారని ఆరోపించారు. సీనియర్ హీరోలను చూడండి.. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ తమ సినిమాల గురించి మాట్లాడరు.. అజయ్ దేవగణ్ నటించిన దృశ్యం 2 మూవీ రూ.200 కోట్లు రాబట్టింది. కానీ వారు సక్సెస్ వేడుక చేసుకోలేదు.
తన సినిమా ఇంత వసూళ్లు రాబట్టిందని తాను చెప్పుకోను..కానీ ఇప్పుడున్న యంగ్ హీరోలు తమ ఒక్క సినిమా హిట్టైతే స్టార్ హీరోల్లా ప్రవర్తిస్తున్నారంటూ చెప్పాడు రోహిత్ షెట్టి. అంతేకాదు ఒక్క హిట్టుపడితే చాలు.. యంగ్ హీరోలు వారి రెమ్యునరేషన్ ను అమాంతంగా పెంచుతున్నారన్నాడు. ఈ పద్దతిని కాస్త తగ్గించుకుంటే బాలీవుడ్ బాగుపడుతుందంటూ చెప్పుకొచ్చాడు రోహిత్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!

