Abbas: ప్రేమదేశం హీరో అబ్బాస్ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో! స్టార్ హీరోయిన్ ఫీచర్స్

1996లో వచ్చిన ప్రేమ దేశం సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు హీరో అబ్బాస్. అందులో అతని హెయిర్ స్టైల్‌కు అప్పటి యువత ఫిదా అయిపోయారు. చాలా మంది కుర్రాళ్లు అబ్బాస్ హెయిర్ స్టైల్ ఫాలో అయిపోయారు. ఇక అమ్మాయిల అయితే అబ్బాస్ ను తమ కలల రాకుమారుడిగా భావించారు.

Abbas: ప్రేమదేశం హీరో అబ్బాస్ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో! స్టార్ హీరోయిన్ ఫీచర్స్
Hero Abbas
Follow us
Basha Shek

|

Updated on: Oct 28, 2024 | 8:24 PM

1996లో విడుదలైన ప్రేమ దేశం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యువతకు ఈ సినిమా బాగా నచ్చేసింది. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీలో వినీత్, అబ్బాస్, టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా కాలేజీ ఫంక్షన్లు, ఈవెంట్లలో ఎక్కడో ఒకచోట ప్రేమదేశం సినిమా పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ సినిమాతో వినీత్, అబ్బాస్, టబుల కెరీరే మారిపోయింది. ముఖ్యంగా హీరో అబ్బాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఓవైపు రాజ హంస వంటి సినిమాల్లో సోలో హీరోగా నటిస్తూనే రాజా, కృష్ణ బాబు, ప్రియా ఓ ప్రియా వంటి సినిమాల్లో స్పెషల్ రోల్స్ పోషించాడు. ఇక నీ ప్రేమకై, నితిన్ మారో వంటి సినిమాల్లో విలన్ గానూ మెప్పించాడీ హ్యాండ్సమ్ యాక్టర్. తెలుగు, తమిళ్ భాషలలో మొత్తం 50కు పైగా చిత్రాల్లో నటించాడు అబ్బాస్. అయితే ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి మాయమైపోయాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. 2011లో మారో తర్వాత ఏ తెలుగు సినిమాలోను కనిపించలేదు అబ్బాస్. కేవలం యాడ్స్ లోనే అప్పుడప్పుడూ టీవీల్లో కనిపించాడు.

ఇవి కూడా చదవండి

సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అబ్బాస్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. అయితే ఆర్థిక సమస్యలు వెంటాడడంతో ఆ మధ్యన మెకానిక్ పనులు కూడా చేసినట్లు చెప్పుకొచ్చాడీ హీరో. ప్రస్తుతం అతను ఓ మోటివేషనల్ స్పికర్ గా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్యన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోనూ అబ్బాస్ కంటెస్టెంట్ గా వస్తాడని ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు.

అబ్బాస్ ఫ్యామిలీ ఫొటో..

సినిమాల సంగతి పక్కన పెడితే.. అబ్బాస్ 1997లో ఏరూమ్ అలి అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు ఏమిరా అలి, కొడుకు అయమాన్ అలి ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అబ్బాస్ అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటాడు. అబ్బాస్ లాగే అతని కూతురు, కొడుకు కూడా అందంగా ఉంటారు. ముఖ్యంగా కూతురు ఏమిరా అలి అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఈ మాత్రం తీసిపోదు. ఆమెను చూసిన నెటిజన్లు సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.

Abbas Family

Abbas Family

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.