Asha Saini: ‘లక్సు పాప’ లుక్కు పూర్తిగా మారిపోయింది.. అసలు గుర్తుపట్టలేకుండా!లేటెస్ట్ ఫొటోస్ వైరల్

‘లక్సు పాపా.. లక్సు పాపా..’ అంటూ నరసింహనాయుడు సినిమాలో నందమూరి బాలకృష్ణ తో ఆడిపాడిన అందాల తార గుర్తుందా? అదేనండీ ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా శైనీ. ఇప్పుడీ ముద్దుగుమ్మ ఏం చేస్తుందో, ఎలా ఉందో తెలుసుకుందా రండి.

Asha Saini: 'లక్సు పాప' లుక్కు పూర్తిగా మారిపోయింది.. అసలు గుర్తుపట్టలేకుండా!లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Asha Saini
Follow us
Basha Shek

|

Updated on: Nov 02, 2024 | 10:27 AM

‘నరసింహ నాయుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘ప్రేమతో రా’ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది నటి ఆశాషైనీ అలియాస్ ఫ్లోరా సైనీ. కెరీర్ లో ఎక్కువ సెకెండ్ హీరోయిన్ క్యారెక్టర్ పాత్రలే పోషించినప్పటికీ తన క్యూట్ నెస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పంజాబ్ రాజధాని ఛండీగఢ్‌లో పుట్టి పెరిగింది ఆశా షైనీ. మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. తన ఫ్యామిలీ కోల్ కతాకు షిఫ్ట్ కావడంతో మిస్ బెంగాలీ అందాల పోటీల్లోనూ పాల్గొంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 1999లో ‘ప్రేమకోసం’తో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత అంతా మన మంచికే, మనసున్న మారాజు, చాలా బాగుంది, చెప్పాలని ఉంది, సర్దుకుపోదాం రండి, అక్కా బావెక్కడ, నవ్వుతూ బ్రతకాలిరా, నరసింహనాయుడు, ప్రేమతో రా, నువ్వు నాకు నచ్చావ్ , ఓ చిన్నదాన తదితర సినిమాల్లో నటించింది. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ సినిమా 143లో ఆశా పోషించిన జర్నలిస్ట్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ మెరిసిందీ అందాల తార.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత చట్టం, బ్రోకర్, ఆ ఇంట్లో, మనీ మనీ మోర్ మనీ తదితర తెలుగు సినిమాల్లో సహాయక నటి పాత్రలు పోషించింది ఆశా శైనీ. అయితే 2011 తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదీ అందాల తార. కేవలం బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లకే పరిమితమైంది. ముఖ్యంగా ఏక్తా కపూర్ నిర్మించిన కొన్ని బోల్డ్ వెబ్ సిరీసులతో అక్కడి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు సింగిల్ గానే ఉంటుంది. ఆ మధ్యన ఓ నిర్మాతతో ప్రేమలో పడ్డానని.. అతడు తనని చిత్రహింసలకు గురి చేశాడంటూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది.

ఇవి కూడా చదవండి

హిందీ వెబ్ సిరీసులతో బిజీ బిజీగా..

View this post on Instagram

A post shared by Flora Saini (@florasaini)

మ్యాగజైన్ కవర్ పేజీ పై ఆశా శైనీ..

View this post on Instagram

A post shared by Flora Saini (@florasaini)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే