KA Movie Collections: రెండో రోజూ అదరగొట్టిన కిరణ్ అబ్బవరం సినిమా.. ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా ‘క'. విలేజ్ బ్యాక్ డ్రాప్ పీరియాడికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ అబ్బవరం సరసన తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దీపావళి కానుకగా గురువారం (అక్టోబర్ 31)న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది.

KA Movie Collections: రెండో రోజూ అదరగొట్టిన కిరణ్ అబ్బవరం సినిమా.. ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?
Kiran Abbavaram's Ka Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 02, 2024 | 11:41 AM

పెళ్లి తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి సినిమా క. ఇదే అతని మొదటి పాన్ ఇండియా సినిమా కూడా. సుజీత్, సందీప్ తెరెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైంది. ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు ఈ సినిమాను చూసి చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. ఇలా అన్ని చోట్ల క సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ .3.8 కోట్లు వసూలు చేసిన క సినిమా ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ లో అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంది. దీంతో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ .6.18 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని ఒక స్పెషల్ పోస్టర్ తో అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక రెండవ రోజు కిరణ్ అబ్బవరం సినిమా కలెక్షన్లు కుమ్మేసింది. ఏకంగా రూ .3కోట్ల వరకు వసూళ్లు అందుకుంది. కేవలం రెండు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే రూ.6.80 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది క సినిమా.ఇక ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.10.25 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. మొత్తానికి కిరణ్ అబ్బవరం కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని అభిమానులు, నెటిజన్లు భావిస్తున్నారు.

శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో.. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపాలకృష్ణారెడ్డి క సినిమాను నిర్మించారు. 1977 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం అభినయ వాసుదేవ్ అనే పోస్ట్ మ్యాన్ పాత్రలో నటించాడు. అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, రాడిన్ కింగ్ స్లే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సామ్ సీఎస్ అందించిన స్వరాలు, బీజీఎమ్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించగా, శ్రీ వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

ఇవి కూడా చదవండి

ప్రముఖుల ప్రశంసలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?