సూపరో సూపర్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్

అక్కినేని నాగార్జున, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ. సూపర్ సినిమాలో అయేషా టాకియా తన అందచందాలతో ప్రేక్షకులను కవ్వించింది.

సూపరో సూపర్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్
Super Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 02, 2024 | 11:36 AM

బాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కొంతం మంది తెలుగు, హిందీ భాషల్లో రాణిస్తున్నారు. ఇక టాలీవుడ్ కు పరిచయం అయిన భామల్లో అయేషా టాకియా ఒకరు. అక్కినేని నాగార్జున, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ. సూపర్ సినిమాలో అయేషా టాకియా తన అందచందాలతో ప్రేక్షకులను కవ్వించింది. అలాగే నటన పరంగాను ఈ అమ్మడికి మంచి మార్కులు పడ్డాయి. సూపర్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో తెలుగు సినిమాలో నటించలేదు. సూపర్ సినిమా తర్వాత అయేషా టాకియా టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

ఇది కూడా చదవండి : Ram Charan: ఏంటీ ఈ సాంగ్ పాడింది రామ్ చరణా…! వింటే ఫ్యాన్స్‌కు పూనకాలే

భారీ అంచనాల మధ్య విడుదలైన సూపర్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు కూడా అంతగా రాలేదు. ఇక ఈ చిన్నది హిందీలో రెండు సినిమాలు చేసింది. టాకియా తన 15 ఏళ్ళ వయసులో మోడల్‌గా తన వృత్తిని ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మరి ప్రేక్షకులను అలరించింది. సూపర్ సినిమా తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. సల్మాన్ ఖాన్ గా ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన వాంటెడ్ సినిమాలో నటించింది. 2009 లో అతిపెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది ఈ సినిమా.

ఇది కూడా చదవండి :ఈ అమ్మడు మామూల్ది కాదుగా.. ఏకంగా ఐలాండ్‌నే కొనేసిన హాట్ బ్యూటీ

ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక ఈ అమ్మడు 2009 మార్చి 1 న సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మిని వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అయేషా టాకియా రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. కానీ అప్పటికి ఇప్పటికీ అయేషా టాకియా చాలా మారిపోయింది. ఇప్పుడు ఈ చిన్నదాన్ని గుర్తుపట్టడం కష్టమే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.