Bigg Boss 8 Telugu: గంటల్లోనే తారుమారైన బిగ్ బాస్ ఓటింగ్.. టాప్‌లోకి గౌతమ్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

బిగ్ బాస్ హౌస్ లో దీపావళి సందడి ముగిసింది. వీకెండ్ వచ్చింది కాబట్టి కంటెస్టెంట్లపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. గత వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. అదే సమయంలో త్రుటిలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న ఓ లేడీ కంటెస్టెంట్ ఈ వారం బయటకు వెళ్లనుందని తెలుస్తోంది.

Bigg Boss 8 Telugu: గంటల్లోనే తారుమారైన బిగ్ బాస్ ఓటింగ్.. టాప్‌లోకి గౌతమ్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
Bigg Boss 8 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Nov 02, 2024 | 11:01 AM

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ తొమ్మిదో వారం ఆఖరుకు వచ్చేసింది. కాబట్టి ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైన ఈ రియాల్టీ షో లో ఎనిమిది వారాల్లో ఏకంగా తొమ్మిది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓమ్, నైనిక, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, మెహబూబ్ దిల్ సే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక తొమ్మిదో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది. ఈసారి తమ్, యష్మి, టేస్టీ తేజ, హరితేజ, నయని పావని నామినేషన్స్‌లో ఉన్నారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ కూడా శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. ఇక గతవారం ఓటింగ్ లో టాప్ లో నిలిచిన యష్మీ ఈ వీక్ ఓటింగ్ లోనూ టాప్ లో దూసుకెళుతోంది. ముఖ్యంగా పానిపట్టు టాస్క్ లో యష్మి చూపించిన జోష్ ఆమెకు ప్లస్ పాయింట్ గా మారింది. కాగా లేటెస్ట్ ఆన్ లైన్ పోలింగ్ ప్రకారం గౌతమ్ మొదటి స్థానంలోకి వచ్చాడని తెలుస్తోంది. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న యష్మి రెండో ప్లేసుకు పడిపోయినట్లు తెలుస్తోంది.

ఇక గత వారంలో త్రుటిలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న నయని ఈ వారం ఓటింగ్ లోనూ ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు ఆమె ఏకంగా మూడో ప్లేస్‌లోకి వచ్చేసింది. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా టేస్టీ తేజ, హరితేజ ఉన్నారు. అంటే ప్రస్తుతం వీరు డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. ఓటింగ్ లెక్కలు ప్రాతిపదికన తీసుకుంటే వీరిద్దరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. అయితే వీరిలో టేస్టీ తేజ బిగ్ బాస్ కు కావాల్సిన ఎంటర్ టైన్మెంట్, ఫన్ కంటెంట్ ఇస్తున్నాడు. వీరితో పోలిస్తే నయని, హరితేజ మాత్రం అంతంతమాత్రంగానే టాస్కులు ఆడుతున్నారు. కాబట్టి వీరిద్దరిలో ఒకరు బయటకు వెళ్లడం ఖాయంగా అనిపిస్తోంది. మరికొన్ని గంటల్లో దీనిపై ఒక క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ