AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ అమ్మడు మామూల్ది కాదుగా.. ఏకంగా ఐలాండ్‌నే కొనేసిన హాట్ బ్యూటీ

కేవలం సినిమాలతోనే కాదు ఇతర బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ కార్లు , భారీదైన ప్లాట్స్, ఇలా చాలానే కొంటుంటారు.

ఈ అమ్మడు మామూల్ది కాదుగా.. ఏకంగా ఐలాండ్‌నే కొనేసిన హాట్ బ్యూటీ
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 01, 2024 | 10:58 AM

Share

చాలా మంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. తమ నటనతో స్టార్ హీరోయిన్స్ గా రాణించడమే కాదు కోట్లల్లో రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. కేవలం సినిమాలతోనే కాదు ఇతర బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ కార్లు , భారీదైన ప్లాట్స్, ఇలా చాలానే కొంటుంటారు. అయితే ఓ అందాలా భామ మాత్రం ఏకంగా ఓ దీవినే కొనుగోలు చేసింది. ఆమె ఎవరో తెలుసా.? స్టార్ హీరోయిన్ కూడా కాదు. చేసిన సినిమాలకు కూడా తక్కువే.. అయినా కూడా కోట్లకు అధిపతి ఆ అమ్మడు. ఎవరో కనిపెట్టారా.?

బాలీవుడ్ తారలు కీర్తి, డబ్బు అలాగే  లగ్జరీ లైఫ్ ఇవి లేకుంటే ఉండలేరు. చాలా మంది వీటికోసమే కష్టపడుతూ ఉంటారు. కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌లు, విలాసవంతమైన జీవనం, ఫ్యాషన్ ప్రతి ఒక్క హీరోయిన్ కోరుకుంటుంది. ప్రకటనలు, బిజినెస్‌లు, సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్స్ అదే రేంజ్‌లో కోట్లు ఖర్చు చేయడం కొత్త కాదు. ఇలా సంపాదించిన డబ్బును ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఖర్చు చేస్తారు. చాలా మంది ఇప్పటికే భారతదేశంలో, విదేశాలలో లగ్జరీ కార్లు, బంగ్లాలను కొన్నారు. ఇప్పుడు ఓ బాలీవుడ్ నటి ఏకంగా శ్రీలంకలో ఓ దీవిని సొంతం చేసుకుంది.

అయితే దీపికా పదుకొనే, ఐశ్వర్యారాయ్, కత్రినా, ఆలియా బట్‌లుఅనుకుంటారేమో ఆమె కాదు. హాలీవుడ్‌లో తన ఉనికిని చాటుకున్న ప్రియాంక చోప్రా కూడా కాదు. ఆమె ఎవరో కాదు శ్రీలంకలో జన్మించిన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ ముద్దుగుమ్మ ఓ దీవిని సొంతం చేసుకుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తండ్రి శ్రీలంక, తల్లి మలేషియా చెందిన వారు. 2012లో, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకలో రూ. 3.5 కోట్ల విలువైన ప్రైవేట్ ఐలాండ్‌ను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ నాలుగు ఎకరాల ద్వీపం శ్రీలంక దక్షిణ తీరంలో ఉంది. శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు చెందిన ప్రైవేట్ ద్వీపానికి సమీపంలో ఉంది. ఇక్కడ విల్లా నిర్మించాలనేది జాక్వెలిన్ కల అని తెలుస్తోంది. ముంబైలో జాక్వెలిన్‌కు 5 బిహెచ్‌కె అపార్ట్‌మెంట్ కూడా ఉందని టాక్. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2009లో అల్లాదీన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది, హౌస్‌ఫుల్, మర్డర్ 2, కిక్ , రేస్ 2తో సహా 30కి పైగా చిత్రాలలో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
జబర్దస్త్ లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్
జబర్దస్త్ లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథుడు
దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథుడు
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్