AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్.. ఇప్పుడేమో 100 కోట్ల పాన్ ఇండియా హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే బ్యాక్ గ్రౌండ్ గట్టిగా ఉండాలని చాలా మంది భావిస్తారు. చాలా వరకు అది నిజం కూడా. అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో స్టార్ హీరోలుగా ఎదిగిన వారు మన ఇండస్ట్రీలోనే చాలా మందే ఉన్నారు.

Tollywood: స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్.. ఇప్పుడేమో 100 కోట్ల పాన్ ఇండియా హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Nov 03, 2024 | 1:54 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ఒక టీవీ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించాడు. క్రమంగా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా అవకాశాలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు తన నటనా ప్రతిభతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇటీవల అతను నటించిన సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్లు దాటేసింది. దీంతో ప్రస్తుతం ఆ స్టార్ హీరో పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. మరి పైన ఉన్న హీరో ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్. అతను మరెవరో కాదు అమరన్ సినిమాతో సినీ ప్రేక్షకులను అలరిస్తోన్న శివ కార్తికేయన్. ఇది అతని పెళ్లి నాటి ఫొటో. శివ కార్తికేయన్ పక్కనున్నది అతని భార్య ఆర్తి. వీరి వివాహం 2010లోనే జరిగింది. ఇప్పుడీ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా పెళ్లినాటికి ఇంకా నటుడిగా స్థిరపడలేదు శివ కార్తికేయన్. తమిళనాడులో పుట్టిపెరిగిన శివకార్తికేయన్‌కి చిన్నప్పటి నుంచే నటన అంటే చాలా ఇష్టం. కానీ పూర్తిస్థాయి నటుడు కావడానికి ముందే ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నటన మీద ఆసక్తి ఉండడంతో ఓసారి అతని స్నేహితులు టీవీ షోకు తీసుకెళ్లారు. అక్కడ సత్తా చాటడంతో యాంకర్ గా కెరీర్ ప్రారంభించాడు శివ కార్తికేయన్. పలు టీవీషోలకు హోస్ట్ గానూ వ్యవహరించాడు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించాడు. ఇక 3 సినిమాల ధనుష్ కి స్నేహితుడిగానూ యాక్ట్ చేశాడు.

సూపర్ స్టార్ రజనీకాంత్ తో శివ కార్తికేయన్..

ఈ క్రమంలోనే 2013లో విడుదలైన ‘కేడీ బిల్లా కిలాడీ రంగ’ మూవీతో హీరోగా మారిపోయాడు శివ కార్తికేయన్. ఇది అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అతను హీరోగా నటించిన ‘డాక్టర్’ సినిమా ఏకంగా రూ.100 కోట్టు రాబట్టింది. వీటి తర్వాత అయలాన్, మహావీరుడు, డాన్ తదితర చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక దీపావళికి అమరన్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.

అమరన్ కు సీఎం స్టాలిన్ ప్రశంసలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..