WTC Final: కివీస్ చేతిలో క్లీన్ స్వీప్.. డబ్ల్యూటీసీ టేబుల్‌లో టాప్ ప్లేస్‌ కోల్పోయిన భారత్.. ఫైనల్ లెక్కలిలా!

సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో పరాభవంతో టీమిండియా ఆటతీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇక ఈ పరాజయం మూడో సారి ప్రతిష్ఠాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్ లకు చేరుకుందామనే ఆశలపై కూడా నీళ్లు చల్లేలా ఉంది.

WTC Final: కివీస్ చేతిలో క్లీన్ స్వీప్.. డబ్ల్యూటీసీ టేబుల్‌లో టాప్ ప్లేస్‌ కోల్పోయిన భారత్.. ఫైనల్ లెక్కలిలా!
Tean India
Follow us
Basha Shek

|

Updated on: Nov 03, 2024 | 2:47 PM

న్యూజిలాండ్ చేతిలో 0-3 తో వైట్ వాష్ కు గురైన భారత జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 62.50 శాతంతో తొలి స్థానానికి చేరుకుంది. టీమిండియా 58.33 శాతంతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. శ్రీలంక (55.56) మూడో స్థానంలో ఉంది. భారత్‌పై టెస్టు సిరీస్‌ను నెగ్గిన కివీస్ 54.55 శాతంతో నాలుగో ప్లేస్ కు చేరింది. ఇక ఆ తర్వాత దక్షిణాఫ్రికా 54.17 శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇకీ టోర్నీలో భారత్‌కు కఠిన సవాల్‌ ఎదురుకానుంది. బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమ్‌ఇండియా ఆసీస్‌తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. WTC సైకిల్‌లో భారత్‌కు ఇదే చివరి సిరీస్‌. ఇందులో కనీసం 4 టెస్టుల్లో గెలిచి.. మరొక దానిని డ్రాగా ముగించాల్సి ఉంటుంది. ఒక్కటి ఓడినా.. ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి.

24 ఏళ్ల తర్వాత..

భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా భారత జట్టు టెస్ట్ క్రికెట్ ఆడి 92 సంవత్సరాలు అవుతోంది. కానీ స్వదేశంలో 3-0 తేడాతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఎప్పుడూ కోల్పోలేదు. అయితే ఈసారి స్వదేశంలో భారత జట్టును ఓడించి న్యూజిలాండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతకుముందు 1958లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ 3-0 తేడాతో ఓడిపోయింది, అయితే ఇది 5 మ్యాచ్‌ల సిరీస్. అలాగే ఆ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

ఇవి కూడా చదవండి

WTC పాయింట్ల పట్టిక..

అయితే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 3-0 తేడాతో కోల్పోవడం ఇదే తొలిసారి. దీంతో 92 ఏళ్ల టెస్టు చరిత్రలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. అంతే కాకుండా 24 ఏళ్ల తర్వాత స్వదేశంలో వైట్ వాష్ కావడం ఇదే మొదటిసారి. చివరిసారిగా 2000లో భారత్ స్వదేశంలో వైట్‌వాష్‌కు గురైంది. ఆ రోజున దక్షిణాఫ్రికా 2-0 తేడాతో భారత్‌ను ఓడించి చరిత్ర లిఖించింది. ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత కివీస్ మరోసారి భారత జట్టుకు వైట్ వాష్ ఓటమి రుచి చూపించింది.ఇక ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌కు టీమ్ ఇండియా సన్నద్ధం కావాలి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుండగా, ఈ సిరీస్ ద్వారా టీమిండియా పునరాగమనం చేస్తుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పవన్ కల్యాణ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న సాయి దుర్గ తేజ్
పవన్ కల్యాణ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న సాయి దుర్గ తేజ్
ఈ మురబ్బాలు తినే ఆహారంలో చేర్చుకోండి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టం
ఈ మురబ్బాలు తినే ఆహారంలో చేర్చుకోండి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టం
రైల్వేగేటును ఢీకొట్టి ఆగిన కారు.. అంతలో దూసుకొచ్చిన రైలు..
రైల్వేగేటును ఢీకొట్టి ఆగిన కారు.. అంతలో దూసుకొచ్చిన రైలు..
మిస్టరీ.. ఆ ఊరి బయట నిండుగా కనిపించిన గోనె సంచి.. ఏముందాని చూడగా
మిస్టరీ.. ఆ ఊరి బయట నిండుగా కనిపించిన గోనె సంచి.. ఏముందాని చూడగా
సాయి పల్లవి ఎక్కడ .? చిన్మయి షాకింగ్ పోస్ట్..
సాయి పల్లవి ఎక్కడ .? చిన్మయి షాకింగ్ పోస్ట్..
పాడైపోయిన ఛార్జర్ కేబుల్‌కు ప్లాస్టర్ చుట్టి వాడుతున్నారా?
పాడైపోయిన ఛార్జర్ కేబుల్‌కు ప్లాస్టర్ చుట్టి వాడుతున్నారా?
ఫ్రిడ్జ్‌లో ఈ ఫ్రూట్స్ పెడుతున్నారా.. వీటిని తిన్నా వృథానే!
ఫ్రిడ్జ్‌లో ఈ ఫ్రూట్స్ పెడుతున్నారా.. వీటిని తిన్నా వృథానే!
ఏరా.! మీరు మారరా ఇక.. హోటల్‌లో టిఫిన్‌కొచ్చారనుకుంటే పొరపాటే..
ఏరా.! మీరు మారరా ఇక.. హోటల్‌లో టిఫిన్‌కొచ్చారనుకుంటే పొరపాటే..
రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. అక్టోబర్‌లో కాంతార ఫస్ట్ చాప్టర్‌.!
రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. అక్టోబర్‌లో కాంతార ఫస్ట్ చాప్టర్‌.!
బరువు తగ్గడానికి కీటో డైట్‌ని అనుసరించండి.. ఏ ఆహారం తినాలంటే
బరువు తగ్గడానికి కీటో డైట్‌ని అనుసరించండి.. ఏ ఆహారం తినాలంటే
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
భార్య విడాకులు.. ఎమోషనల్ అయిన రెహ్మాన్.! వీడియో
భార్య విడాకులు.. ఎమోషనల్ అయిన రెహ్మాన్.! వీడియో