Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: బీజీటీకి ముందే చేతులెత్తేసిన రోహిత్.. భారమంతా యువ ఆటగాళ్లదే అంటూ కామెంట్స్

Border Gavaskar Trophy: న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడిన తర్వాత, టీం ఇండియా ఇప్పుడు ఐదు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియా ఐదు టెస్ట్‌ల్లో నాలుగు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. లేదంటే డబ్య్లూటీసీ ఫైనల్ ఆడకుండానే వెనుదిరగాల్సి ఉంటుంది.

IND vs AUS: బీజీటీకి ముందే చేతులెత్తేసిన రోహిత్.. భారమంతా యువ ఆటగాళ్లదే అంటూ కామెంట్స్
Rohit Sharna
Follow us
Venkata Chari

|

Updated on: Nov 03, 2024 | 5:24 PM

Rohit Sharma: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడిపోయింది. ఈ ఘోర పరాజయం తర్వాత, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సన్నాహాలకు సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మను ఒక ప్రశ్న అడిగారు. దీనిపై కెప్టెన్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా టూర్ చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుందన్నారు. అంతా యువ ఆటగాళ్లపైనే ఆధారపడి ఉంటుందని తెలిపాడు.

న్యూజిలాండ్‌పై భారత బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా ఓడిపోయారు. రోహిత్, విరాట్ కోహ్లి వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ స్వయంగా పరుగులు చేయలేదు. జట్టు బ్యాటింగ్ ఫామ్‌పై రోహిత్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ- సీనియ‌ర్లు ప‌రుగులు చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆందోళ‌న‌ పెరుగుతోంది. ఆస్ట్రేలియాలో ప్రత్యేకంగా ఏదైనా చేసే అవకాశం ఉంది. మేము ఇప్పుడు దీనిపై దృష్టి పెడతాము. ఈ పర్యటన సవాలుతో కూడుకున్నది. యువ ఆటగాళ్లతో కూర్చుని ఏం చేయాలో చర్చితాం. ఆస్ట్రేలియాలో వేరే రకమైన ఆట ఉండబోతోందని మేం అర్థం చేసుకున్నాం. సీనియర్లు భయపడకుండా అలాంటి వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యం. గత రెండు సార్లు అక్కడికి వెళ్లి గెలిచాం. ఆస్ట్రేలియాలో అంతా బాగుంటుందని ఆశిస్తున్నాను. మేం విషయాలను చాలా సరళంగా ఉంచాలనుకుంటున్నాం. దీనిపై పెద్ద ఎత్తున దృష్టి సారించాం’ అంటూ చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్‌తో సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన భారత్‌కు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం కష్టంగా మారింది. ఇప్పుడు టీమ్ ఇండియా ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఇక్కడ కనీసం నాలుగు టెస్టుల్లో గెలవడమే లక్ష్యం. ఇది రోహిత్ సేనకు అంత సులభం కాదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..