IND vs NZ: 68 ఏళ్లలో 2 విజయాలు.. కట్‌చేస్తే.. 18 రోజుల్లో హ్యాట్రిక్ విజయాలతో షాకిచ్చిన కివీస్

India vs New Zealand: భారత్, న్యూజిలాండ్ మధ్య సిరీస్ ముగిసింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2వ మ్యాచ్‌లో 113 పరుగుల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్ 3వ మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Venkata Chari

|

Updated on: Nov 03, 2024 | 6:00 PM

భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభమై 69 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే గత 68 ఏళ్లలో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది అంటే నమ్మాల్సిందే. అయితే, ఈసారి పాత లెక్కలన్నింటిని తలకిందులు చేయడంలో కివీస్ దళం విజయం సాధించింది.

1 / 5
1969లో తొలిసారిగా న్యూజిలాండ్ భారత్‌లో టెస్టు మ్యాచ్‌ను గెలుచుకుంది. నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ 167 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత 1988లో గెలిచి 2వ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత భారత్‌లో న్యూజిలాండ్ జట్టు ఒక్క విజయం కూడా సాధించలేదు.

2 / 5
అంటే 1955 నుంచి 2023 వరకు న్యూజిలాండ్ భారత్‌లో కేవలం 2 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. అయితే, ఈసారి కివీస్ జట్టు కసితో టీమ్ ఇండియా లెక్కలన్నీ తలకిందులు చేసింది.

3 / 5
అక్టోబర్ 16 నుంచి ప్రారంభమైన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో స్వదేశంలో భారత్‌ను 3-0తో ఓడించిన ప్రపంచంలోనే మొదటి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.

4 / 5
అంటే 1955 నుంచి 2023 వరకు కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన న్యూజిలాండ్ జట్టు కేవలం 18 రోజుల్లోనే మూడు మ్యాచ్‌లు గెలిచి భారత్‌లో టీమిండియాను చిత్తు చేసింది. దీంతో భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలవాలన్న 68 ఏళ్ల కల కూడా నెరవేరింది. అది కూడా క్లీన్ స్వీప్ సిరీస్ విజయంతో ప్రత్యేకమే.

5 / 5
Follow us