AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు 100కు పైగా సిగరెట్లు.. కట్ చేస్తే.. పుట్టిన రోజున స్మోకింగ్‌పై సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో

స్మోకింగ్ ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అలవాటు కారణంగా క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బులు సోకే అవకాశముంది. అయితే అన్నీ తెలిసినా చాలా మంది గప్పు గప్పు మంటూ సిగరెట్లు కాలుస్తుంటారు. ఇందులో పలువురు స్టార్ హీరోలు కూడా ఉన్నారు.

రోజుకు 100కు పైగా సిగరెట్లు.. కట్ చేస్తే.. పుట్టిన రోజున స్మోకింగ్‌పై సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో
Smoking
Basha Shek
|

Updated on: Nov 04, 2024 | 12:30 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఉండే ఎంతో మంది స్టార్ హీరోలకు స్మోకింగ్ అలవాటు ఉంది. అయితే ఆరోగ్యం లేదా తమ పిల్లల ప్రభావమో చాలామంది ఈ చెడ్డ అలవాటును మానేసుకున్నారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ చేరాడు. కింగ్ ఖాన్ షారుఖ్‌ కు కూడా మొన్నటివరకు ఈ చెడ్డ అలవాటు ఉండేది. ఒక్కోసారి అతను రోజుకు 100 సిగరెట్లుకు పైగా కాల్చేవాడు. ఈ అలవాటు కారణంగానే పబ్లిక్ ప్లేస్‌లో సిగరెట్ తాగి పలు సార్లు వివాదాల్లో ఇరుక్కున్నాడు. అయితే ఇప్పుడు షారుఖ్ పూర్తిగా మారిపోయాడు. పొగతాగడం మానేశాడు. రీసెంట్ గా తన బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని అందరికి చెప్పాడు. ‘నేను పొగతాగడం పూర్తిగా మానేశాను’ అని గర్వంగా చెప్పుకున్నాడు. అతనిలో వచ్చిన ఈ మార్పు పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ వయసు సుమారు 59 ఏళ్లు. సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడుకాబట్టి అతనికి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే ట్టి స్మోకింగ్ కు దూరంగా ఉండాలని షారుఖ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ధూమపానం మానేసానని, అందరూ ఈ చెడ్డ అలవాటును వదిలేయాలటూ షారుఖ్ ఖాన్ మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసి షారుఖ్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.

సిగరెట్ తాగడం పూర్తిగా మానేసినా షారుఖ్ ఖాన్ శ్వాస సమస్య పూర్తిగా నయం కాలేదు. ‘నేను ఎప్పుడూ శ్వాసకోశ సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. కానీ ఇప్పటికీ అది సాధ్యం కాలేదు. త్వరలోనే అది సాధ్యమవుతుంది. నేను ధూమపానం మానేసినందుకు సంతోషంగా ఉంది’ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు షారుక్ ఖాన్.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

షారుఖ్ ఖాన్ 2023లో ‘జవాన్’, ‘పఠాన్’ మరియు ‘డంకీ’ సినిమాలతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. కానీ 2024లో ఆయన సినిమాలేవీ విడుదల కాలేదు. స్క్రిప్ట్ సెలక్షన్‌లో చాలా ఓపికగా, శ్రద్ధగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఆయన పిల్లలు కూడా చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్నారు. కూతురు సుహానా ఖాన్ నటిగా చురుగ్గా వ్యవహరిస్తుండగా, కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంపై దృష్టి సారిస్తున్నారు.

 ఇండిపెండెన్సెడే వేడుకల్లో షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ..

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.