- Telugu News Photo Gallery Cinema photos Heroine Samantha Shared Rajasthan’s Vacation photos Goes Viral in citadel Promotions, Details here
Samantha: అడవుల బాట పట్టిన స్టార్ హీరోయిన్.! ఫొటోస్ వైరల్..
ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీగా ఉండటం కెరీర్‌కు ఎంత కీలకమో.. పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం తెలియక చాలా మంది తెగ కష్టపడుతుంటారు. కానీ తను అలా కాదంటున్నారు సమంత. ఇటు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే.. అటు ప్రొఫెషనల్‌గానూ రప్ఫాడిస్తున్న స్యామ్‌పై స్పెషల్ స్టోరీ. చాలా రోజుల తర్వాత కెరీర్‌లో బిజీగా ఉన్నారు సమంత.
Updated on: Nov 04, 2024 | 3:39 PM

ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీగా ఉండటం కెరీర్‌కు ఎంత కీలకమో.. పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం తెలియక చాలా మంది తెగ కష్టపడుతుంటారు.

కానీ తను అలా కాదంటున్నారు సమంత. ఇటు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే.. అటు ప్రొఫెషనల్‌గానూ రప్ఫాడిస్తున్న స్యామ్‌పై స్పెషల్ స్టోరీ. చాలా రోజుల తర్వాత కెరీర్‌లో బిజీగా ఉన్నారు సమంత.

ఆ మధ్య మయోసైటిస్ కారణంగా లాంగ్ బ్రేక్ తీసుకున్న స్యామ్.. ఇప్పుడా బాకీ అంతా తీర్చేస్తున్నారు. తెలుగులో కాదు కానీ హిందీలో మాత్రం చాలా బిజీ అయ్యారు ఈ బ్యూటీ. నవంబర్ 7 నుంచి ఈమె నటిస్తున్న సిటాడెల్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ఈ బిజీలో ఉంటూనే.. పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు సమంత. బిజీ షెడ్యూల్స్ మధ్యలో రిలీఫ్ కోసం రాజస్థాన్‌లోని రణతంబోర్ అడవికి వెళ్లారు సమంత. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

పులులు తిరిగే చోట సాహస యాత్ర చేస్తున్నారు స్యామ్. అడవి జంతువులతో పాటు ప్రకృతిలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్నానంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు ఈ భామ. అక్కడి ముచ్చట్ల గురించి స్టోరీ పోస్ట్ చేసారు.

సమంత ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు కానీ వెబ్ సిరీస్‌లు మాత్రం బాగానే చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ తర్వాత రాజ్ డికే దర్శకత్వంలోనే రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్‌కు ఓకే చెప్పారు స్యామ్.

త్వరలోనే షూట్ మొదలు కానుంది. ఈ గ్యాప్‌లోనే అడవి బాట బట్టారు సమంత. అక్కడే హాయిగా ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు.




