Nirosha: సింధూర పువ్వు హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు మరింత అందంగా మారిపోయిందిగా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

'సింధూరా పువ్వా.. తేనే చిందించరావా..' 90వ దశకంలో టీవీలో తరచూ వచ్చే ఈ పాట కుర్రకారును ఒక ఊపు ఊపేసింది. ఇక ఈ సాంగ్ లో లంగా ఓణీలో కనిపించిన డస్కీ బ్యూటీ నిరోషా అందానికి చాలా మంది ఫిదా అయిపోయారు. అన్నట్లు ఈ అందాల తార ఒక స్టార్ హీరోయిన్ చెల్లెలు. అలాగే ఈ అందాల తార భర్త కూడా ఒక ప్రముఖ నటుడే.

Nirosha: సింధూర పువ్వు హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు మరింత అందంగా మారిపోయిందిగా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Nirosha Radha
Follow us
Basha Shek

|

Updated on: Nov 04, 2024 | 1:12 PM

సింధూర పువ్వు సినిమాతో కుర్రకారు హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంటి నటి నిరోషా రాధ. అప్పట్లో తన అందం, అభినయంతో అందరినీ మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ మరెవరో కాదు స్టార్ హీరోయిన్ రాధిక చెల్లెలు. కోలీవుడ్ ప్రముఖ నటుడు ఎం. ఆర్. రాధా కూతురు కూడా. రాధికా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ సొంతం చేసుకన్నాక నిరోషా వెండితెరకు పరిచయమైంది. అగ్ని నక్షత్రం ఆమె మొదటి సినిమా. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో ఘర్షణ పేరుతో రిలీజ్ అయ్యింది. ప్రభు, కార్తీక్, అమల, నిరోషా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఎవర్ గ్రీన్ సాంగ్ ‘నిన్ను కోరి వర్ణం.. వర్ణం’ ఈ సినిమాలోనిదే. ఈ సినిమా తర్వాత నిరోషాకు సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. అందులో సింధూర పువ్వు కూడా ఒకటి. పిఆర్ దేవరాజ్ తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో రాంకీ హీరోగా నటించాడు. సీనియర్ నటుడు విజయ్ కాంత్ మరో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత తెలుగులో నిరోషా.. ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ ,కొబ్బరి బోండాం, డిటెక్టివ్ నారద,అత్తింట్లో అద్దె మొగుడు, ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు, అసాధ్యుడు, వన్ బై టూ, భలే ఖైదీలు, ఒక ఊరిలో, నువ్వు తోపురా తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. బాలకృష్ణ, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, వినోద్ కుమార్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఇక సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సింధూరపువ్వు సినిమాలో తనతో కలిసి నటించిన హీరో రాంకీనే ప్రేమించి పెళ్లాడింది నిరోషా. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆమె అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేస్తోంది. అలాగే తెలుగులో కొన్ని సీరియల్స్ లోనూ నటించింది. సుడిగుండాలు, మనసు గీసిన బొమ్మ, నందిని, ఇది కథ కాదు, జనని, మనసా కవ్వించకే, తల్లి ప్రేమ, కథ కాని కథ, మావి డాకులు తదితర సీరియల్స్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

నిరోషా ఫొటోస్..

సినిమాలు, సీరియల్స్ తో పాటు సోషల్ మీడియాలో నూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది నిరోష. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అందులో షేర్ చేస్తుంటుంది. వీటిని చూస్తుంటే అప్పటికంటే కొంచెం బొద్దుగా మారింది. కానీ, అదే అందంతో అలరిస్తుందీ సీనియర్ నటీమణి. ప్రస్తుతం నిరోషా లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.