- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan Ustaad Bhagat Singh, OG and Hari Hara veera mallu movies shootings updates are in Trending
Ustaad Bhagat Singh: ఊరిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్.! మనల్ని ఎవడ్రా ఆపేది.. ఇదే ట్రెండ్.!
పవర్‌స్టార్ ఆల్రెడీ మేకప్ వేసుకున్న సినిమాలు మూడు. అందులో ఆల్రెడీ రెండు సెట్స్ మీదున్నాయి. ఇంకోటి ఎక్కడుంది అంటే నిన్న మొన్నటిదాకా ఆన్సర్ చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు సడన్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఆ థర్డ్ ప్రాజెక్ట్.. ఇంతకీ మనం ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామో.. అర్థమైందిగా.! యస్.. ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఉస్తాద్ భగత్‌సింగ్. హరీష్ శంకర్ డైరక్షన్‌లో తెరకెక్కుతోంది.
Anil kumar poka | Edited By: Ravi Kiran
Updated on: Nov 06, 2024 | 9:25 PM

గబ్బర్‌సింగ్ కాంబోలో ఉస్తాద్ భగత్‌సింగ్ వస్తుందని తెలియగానే పక్కా కమర్షియల్ హిట్ అని అనుకున్నారు జనాలు. దానికి తగ్గట్టుగానే ఎన్నికల సమయంలోనూ హల్ చల్ చేసింది ఉస్తాద్ భగత్‌సింగ్.

ఇప్పుడు సడన్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఆ థర్డ్ ప్రాజెక్ట్.. ఇంతకీ మనం ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామో.. అర్థమైందిగా.! యస్.. ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఉస్తాద్ భగత్‌సింగ్.

పవర్‌స్టార్ పేరు నాన్‌స్టాప్‌గా ట్రెండ్ అవుతోంది. నిన్నటిదాకా సెట్స్ మీదున్న ఆయన సినిమాలతో ముడిపెట్టి ట్రోల్ చేస్తే,

ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్లకుండా బ్రేక్‌లో ఉన్న సినిమా గురించి మాట్లాడుతున్నారు జనాలు. ఇంతకీ ఆ సినిమా ఏంటో.. మీకు ఈ పాటికే అర్థమయ్యే ఉంటుందిగా..

ఓజీ ఓజీ అని అరిస్తే ఏం వస్తుంది.. దానికి బదులు భగవన్నామస్మరణ చేయండి అంటూ పవర్‌స్టార్ చెప్పిన మాటలను వైరల్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

మీ సినిమా చూస్తే చాలు బాస్ అంటూ సమాధానం చెబుతున్నారు. అంతే కాదు.. గబ్బర్‌సింగ్ కాంబో గురించి కూడా పనిలో పనిగా ఆరా తీస్తున్నారు.

ఆయన కాల్షీట్లు అందుబాటులోకి వచ్చేసరికి, ఉస్తాద్ టీమ్ పక్కా స్క్రిప్టుతో రెడీ అవుతుందన్నది ఫ్యాన్స్ ని ఊరిస్తున్న మాట.





























