AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR – Venkatesh: ఎన్టీఆర్, వెంకటేష్ ఇప్పుడు చుట్టాలైపోయారుగా.. నార్నే నితిన్‌కు కాబోయే భార్య ఎవరో తెలుసా?

ఎన్టీఆర్ బామ్మర్ధి అనే ట్యాగ్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నార్నే నితిన్. మ్యాడ్ అంటూ మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక రెండో సినిమా ఆయ్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా చేరువైపోయాడు.

Jr NTR – Venkatesh: ఎన్టీఆర్, వెంకటేష్ ఇప్పుడు చుట్టాలైపోయారుగా.. నార్నే నితిన్‌కు కాబోయే భార్య ఎవరో తెలుసా?
Narne Nithin Engagement
Basha Shek
|

Updated on: Nov 04, 2024 | 10:58 AM

Share

ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి సోదరుడు, టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నాడీ క్రేజీ హీరో. తాజాగా శివానీ అనే అమ్మాయితో నార్నే నితిన్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ వేదికగా ఆదివారం (నవంబర్ 03) జరిగిన ఈ ఫంక్షన్ కు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, దగ్గుబాటి ఫ్యామిలీ కూడా హాజరయ్యారు. ఎన్టీఆర్ తో పాటు ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్, భార్గవ్‏లతోపాటు హీరో కళ్యాణ్ రామ్, వెంకటేశ్, రానా దగ్గుబాటి, నిర్మాత చినబాబు తదితరులు సందడి చేశారు. ఈ సందర్భంగా కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం నార్నేనితిన్-శివానీల ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా నార్నే నితిన్ కు కాబోయే ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో వెంకీ మామకు ఆమెకు ఉన్న సంబంధమేంటోనని ఆరా తీస్తున్నారు. నార్నే నితిన్ ఎంగేజ్​మెంట్ చేసుకున్న శివానీ మరెవరో కాదు.. హీరో దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీకి దగ్గరి బంధువులైన అయిన తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్.. స్వరూపల కూతురు. వెంకీమామకు శివానీ.. కజిన్ డాటర్ అవుతుంది. ఇప్పుడు శివానీకి ఎన్టీఆర్ బావమరిదితో శివానీకి నిశ్చితార్థం జరగడంతో.. వీరి కుటుంబ సభ్యులు ఇక చుట్టాలైపోయినట్లే.

ఇవి కూడా చదవండి

నార్నే నితిన్ ఎంగేజ్ మెంట్ ఫొటోస్..

కాగా నార్నే నితిన్ ఎంగేజ్ మెంట్ వేడుకలో హారిక హాసిని ఎంటర్​టైన్​మెంట్స్ అధినేత చినబాబు, సితార ఎంటర్​టైన్​మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మ్యాడ్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు నార్నే నితిన్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎంగేజ్ మెంట్ వేడుకలో ఎన్టీఆర్ కుమారులతో వెంకటేష్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..