- Telugu News Photo Gallery Cinema photos AP Deputy CM Power Star Pawan kalyan Advice to His Fans in His movies Making Telugu Heroes Photos
Pawan kalyan: ఫ్యాన్స్ కి పవన్ సలహా.! ఒక్క దెబ్బతో కంగారుపడుతున్న మేకర్స్..
పవర్‌స్టార్ ఎక్కడికి వెళ్లినా.. ఎవరితో మాట్లాడుతున్నా.. ఆయన ఫ్యాన్స్ కి మాత్రం ఎప్పుడూ ఆయన సినిమాలే గుర్తుకొస్తుంటాయి.. ఓజీ ఓజీ అంటూ అభిమానులు అరుస్తుంటే.. అలా కాదు అనాల్సింది అంటూ పవన్ కల్యాణ్ ఓ సలహా ఇచ్చారు. ఫ్యాన్స్ కి ఆ సలహా ఎలా అనిపించినా.. ఆయనతో సినిమాలు తీస్తున్న నిర్మాతలకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంతకీ విషయమేంటి.? బ్రో.. మళ్లీ ఎప్పుడు బ్రో..
Updated on: Nov 04, 2024 | 9:19 PM

దానికి తగ్గట్టు మొత్తం చేంజ్ చేసే పనిలో ఉన్నారట హరీష్. ఇటీవల పవర్‌స్టార్‌ని కలిసి అదే విషయాన్ని చెప్పారట ఈ కెప్టెన్. ఆల్రెడీ సెట్స్ మీదున్న సినిమాలు పూర్తయ్యాక ఉస్తాద్ మీద కాన్‌సెన్‌ట్రేట్ చేద్దామని అన్నారట పవర్‌స్టార్. సో.. దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేసుకుంటోంది టీమ్.

ఇంకొన్నాళ్ల షూటింగ్ మినహా సింహభాగం చిత్రీకరణ పూర్తయింది. ఆ మిగిలిన షెడ్యూల్‌ని కూడా గురువారం నుంచి మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.

అదే జరిగితే 2025లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల రిలీజులతో పండగ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు పవర్‌స్టార్ సైన్యం.

ఆల్రెడీ కొన్నాళ్ల పాటు షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. హరిహరవీరమల్లు సెట్స్ లో ఉండటం చూసి ఓజీ టీమ్ కూడా షూటింగ్‌ని స్టార్ట్ చేసేసింది. త్వరలో మా హీరో సెట్స్ కి వచ్చేస్తారంటూ ఓపెన్‌గా చెప్పేసింది.

చెప్పినట్టు సమ్మర్‌కి హరిహరవీరమల్లుతో వచ్చేయాలని ఫిక్సయ్యారు పవన్. 80, 90ల్లో జరిగే పీరియాడిక్ కథతో ప్యాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నారు పవర్‌స్టార్. ఈ సినిమా ఇచ్చే రిజల్టును బట్టి, ఓజీని డిజైన్ చేయాలని ఫిక్సయ్యారు సుజీత్.

కదలిక అంటూ మొదలైతే.. వీరమల్లు తర్వాత క్యూలో ముందుకు జరిగే మూవీ ఓజీ యేగా.. అని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా హరిహరవీరమల్లు.

ఆయన చెప్పిన సలహాను ఫ్యాన్స్ సిన్సియర్‌గా తీసుకున్నా, మేకర్స్ గుండెలో మాత్రం గుబులు మొదలైంది. సార్.. సెట్స్ కి ఎప్పుడు వస్తారా? సినిమాల షూటింగులు ఎప్పుడు పూర్తి చేస్తారా? ఎప్పుడు రిలీజులు చూస్తామా? అని వెయిట్ చేస్తున్నారు మేకర్స్... మరి పవర్‌స్టార్ ప్లానింగ్ ఎలా ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.!




