Tollywood: ఈ నటుడు ఆ స్టార్ హీరో తమ్ముడని తెలుసా? కుమారుడు కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరో

అయ్యప్ప పి శర్మ.. ఈ పేరు చెబితే చాలామందికి గుర్తుకు రాకపోవచ్చు కానీ.. కేజీఎఫ్ 2లో హీరో యశ్ కు తోడుగా ఉండే వానరం అంటే ఇట్టే మదిలో మెదులుతాడు. ఇక బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలోనూ ఆత్మగా, బింబిసారలో కేతు పాత్రల తో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

Tollywood: ఈ నటుడు ఆ స్టార్ హీరో తమ్ముడని తెలుసా? కుమారుడు కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరో
Ayyappa P Sharma
Follow us
Basha Shek

|

Updated on: Nov 06, 2024 | 12:10 PM

కేజీఎఫ్ 2 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయ్యప్ప శర్మ. ఈమూవీలో యష్‌కు తోడుగా వానరం అనే పాత్రలో జీవించేశాడీ సీనియర్ యాక్టర్. గన్స్ నుంచి.. ఆయుధాల వరకు ఎలా వాడాలో ట్రైనింగ్ ఇస్తూనే యష్ ను కంటికి రెప్పలా కాపాడుకునే వ్యక్తి పాత్రలో అద్భుతంగా నటించాడు అయ్యప్ప శర్మ. ఇక బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సినిమాలోనూ విలన్ గా మెప్పించాడు అయప్ప శర్మ. ఇందులో ఆయన పోషించిన ఆత్మ పాత్రకు మంచి పేరు వచ్చింది. అలాగే నందమూరి కల్యాణ్ రామ్ నటించిన బింబిసారలోనూ కేతుగా తెలుగు ఆడియెన్స్ ను ఆయన మెప్పించారు. ఇవే కాదు సందీప్ కిషన్ మైఖెల్, శివం భజే, తగ్గేదేలే, తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్, బాహుబలి ద కంక్లూజన్, లచ్చిందేవికి ఓ లెక్కుంది, అరవింద సమేత, కాటమ రాయుడు తదితర తెలుగు సినిమాలతో నూ టాలీవుడ్ ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు అయ్పప్ప శర్మ. అన్నట్లు ఈ నటుడు మన తెలుగు వాడే. టాలీవుడ్ సీనియర్ నటుడు పీజే శర్మ ముగ్గురి కొడుకుల్లో అయ్యప్ప శర్మ కూడా ఒకరు. అంటే మన సాయి కుమార్ కు చిన్న తమ్ముడు అవుతాడు. అలాగే ప్రముఖ కన్నడ నటుడు, అరుంధతి పశుపతి క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ కూడా.. అయ్యప్పకు అన్న అవుతాడు. అంటే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోగా వెలుగొందుతోన్న ఆది సాయి కుమార్ అయ్యప్ప శర్మకు కొడుకు వరుస అవుతాడు.

తెలుగులో తక్కువ సినిమాలు చేసిన అయప్ప శర్మ కన్నడ భాషా సినిమాల్లోనే ఎక్కుఎగా కనిపించాడు. కెరీర్ ప్రారంభంలో సాయి కుమార్ నటించిన ‘ఈశ్వర్ అల్లా’ చిత్రానికి దర్శకత్వం వహించాడు అయ్యప్ప. అంతేకాదు నిర్మాతగానూ వ్యవహరించాడు. కాగా 2010 నుండి 2012 వరకు జరిగిన పురుషుల క్రికెట్ లీగ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు అయ్యప్ప. అప్పుడే అతని పేరు బాగా వినిపించింది. ఇక హైదరాబాద్‌లోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా కొద్ది కాలం పాటు పని చేశాడు. ప్రస్తుతం తెలుగులో అయ్యప్ప శర్మ ఎర్రచీర అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనితో పాటుగా.. తుఫాన్ అనే సినిమా చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

సాయి కుమార్ ఫ్యామిలీ..

Ayyappa P. Sharma Family

Ayyappa P. Sharma Family

భార్యతో ఆది సాయి కుమార్..

View this post on Instagram

A post shared by ActorAadi (@aadipudipeddi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మార్కెట్లోకి నయా మాల్‌.. ఈ నెలలో వస్తోన్న కొత్త ఫోన్స్‌ ఇవే..
మార్కెట్లోకి నయా మాల్‌.. ఈ నెలలో వస్తోన్న కొత్త ఫోన్స్‌ ఇవే..
ఇక ఏటీఎంల నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా.. ఈపీఎఫ్‌వో ​​3.0 అంటే..
ఇక ఏటీఎంల నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా.. ఈపీఎఫ్‌వో ​​3.0 అంటే..
అయ్యప్ప భక్తులకు రైల్వే కీలక సూచన
అయ్యప్ప భక్తులకు రైల్వే కీలక సూచన
బంగ్లాదేశ్‌ ప్రభుత్వ తీరును ఖండించిన ఇమామ్‌ సయ్యద్‌ అహ్మద్‌
బంగ్లాదేశ్‌ ప్రభుత్వ తీరును ఖండించిన ఇమామ్‌ సయ్యద్‌ అహ్మద్‌
బీరకాయ బెనిఫిట్స్ తెలిస్తే వదిలిపెట్టరు.. ఇమ్యూనిటీ పెరగడంతో పాటు
బీరకాయ బెనిఫిట్స్ తెలిస్తే వదిలిపెట్టరు.. ఇమ్యూనిటీ పెరగడంతో పాటు
కళ్లు మూసుకున్న బంగ్లా ప్రభుత్వం.. విషం కక్కుతున్న విద్వేషం
కళ్లు మూసుకున్న బంగ్లా ప్రభుత్వం.. విషం కక్కుతున్న విద్వేషం
ఇదేందయ్యా ఇది.. 7 పరుగులకే ఏడుగురు ఔట్..
ఇదేందయ్యా ఇది.. 7 పరుగులకే ఏడుగురు ఔట్..
ఇదేం మాస్ రా మావా! పుష్ప 3లో విలన్‌గా ఆ టాలీవుడ్ క్రేజీ హీరో!
ఇదేం మాస్ రా మావా! పుష్ప 3లో విలన్‌గా ఆ టాలీవుడ్ క్రేజీ హీరో!
ఆస్ట్రేలియాకు దడ పుట్టిస్తోన్న కోహ్లీ.. అడిలైడ్‌లో తగ్గేదేలే..
ఆస్ట్రేలియాకు దడ పుట్టిస్తోన్న కోహ్లీ.. అడిలైడ్‌లో తగ్గేదేలే..
అప్పుల్లో జియో, ఎయిర్‌టెల్‌, వీఐ.. షాకిస్తున్న కస్టమర్లు..
అప్పుల్లో జియో, ఎయిర్‌టెల్‌, వీఐ.. షాకిస్తున్న కస్టమర్లు..