Allu Arjun: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట.. కేసు కొట్టేసిన న్యాయస్థానం
ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ . అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు. అనుమతి లేకుండా భారీగా జనసమీకరణ చేశారంటూ అల్లు అర్జున్‌పై ఫిర్యాదు
హీరో అల్లు అర్జున్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడింది. అల్లు అర్జున్ పై ఉన్న కేసును కోర్టు కొట్టేసింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టి వెయ్యాలనీ సినీ హీరో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు మాజీఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హై కోర్టు నేడు తీర్పు ఇచ్చింది. అల్లు అర్జున్ పై ఉన్న కేసును హై కోర్టు కొట్టేసింది. అంతకు ముందు ఎఫ్ ఐ ఆర్ అధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చిన హై కోర్టు.. ఇప్పుడు కేసును కొట్టివేసింది.
ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!
ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లారు అల్లు అర్జున్. కాగా అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీగా అభిమానులు అక్కడకు చేరుకున్నారు. అనుమతి లేకుండా భారీగా జనసమీకరణ చేశారంటూ అల్లు అర్జున్‌పై ఫిర్యాదు చేశారు. దాంతో సెక్షన్ 144, పోలీస్ యాక్టు 30 ఉల్లంఘించారని కంప్లైంట్ రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్. తాజాగా అల్లు అర్జున్ పై ఉన్న కేసును హై కోర్టు కొట్టేసింది.