Deepika Padukone: ఈ దువా ఎందుకు? మీ కూతురికి హిందూ పేరు పెట్టడానికి మనసొప్పలేదా? దీపిక దంపతులపై ట్రోల్స్

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక పదుకొణె-రణ్ వీర్ సింగ్ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో పండంటి ఆడబిడ్డను ప్రసవించింది దీపిక. ఇటీవలే తమ కూతురికి నామకరణం కూడా చేశారీ లవ్లీ కపుల్.

Deepika Padukone: ఈ దువా ఎందుకు? మీ కూతురికి హిందూ పేరు పెట్టడానికి మనసొప్పలేదా? దీపిక దంపతులపై ట్రోల్స్
Deepika Padukone Family
Follow us
Basha Shek

|

Updated on: Nov 06, 2024 | 10:48 AM

తమ ఆరేళ్ల వైవాహిక బంధానికి ప్రతీకగా ఈ ఏడాది సెప్టెంబర్ లో పండంటి మహాలక్ష్మిని తమ జీవితంలోకి ఆహ్వానించారు రణ్ వీర్ సింగ్- దీపికా పదుకొణె. దీంతో ఈ బాలీవుడ్ లవ్లీ కపుల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక దీపావళి పండగను పురస్కరించుకుని తమ కూతురికి నామకరణం కూడా చేశారీ స్టార్ కపుల్. యసోషల్ మీడియా వేదికగా తమ గారాల పట్టి ఫొటోను షేర్ చేస్తూ.. తమ గారాల పట్టికి దువా పదుకొణె సింగ్ అని నామకరణం చేసినట్టు వెల్లడించారు. ‘దువా అంటే ప్రార్థన. మా ప్రేయర్స్‌కు సమాధానమే ఈమె’ అని ఈ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో కొద్ది క్షణాల్లోనే దీపిక దంపతులు పోస్ట్ వైరల్ గా మారింది. అలియా భట్‌, మమితా బైజు, షాలినీ పాండే తదిర సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు దీపిక-రణ్ వీర్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. దువా పదుకొణెకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ కామెంట్స్ పోస్ట్ చేశారు. ఇదే సమయంలో కొందరు నెటిజన్లు దీపిక దంపతులను ట్రోలింగ్ చేస్తున్నారు. తమ కుమార్తెకు ఇస్లాం పేరు పెట్టడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కాగా తల్లిదండ్రుల ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా తమ కూతరికి దువా పదుకొణె సింగ్ అని పేరు పెట్టారు దీపిక, రణ్ వీర్ సింగ్. అయితే దువా అనేది ఇస్లామిక్ పదమంటూ నెటిజన్లు దీపిక దంపతులను తప్పపడుతున్నారు. హిందూ తల్లితండ్రులయిన మీకు ఇంకా ఏ పేరు నచ్చలేదా? కుమార్తెకు ప్రార్థన అని ఎందుకు పేరు పెట్టలేదు? లేదా హిందూ పేరు పెట్టడానికి మీకు మనసొప్పలేదా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దీపిక, రణ్ వీర్ సింగ్ షేర్ చేసిన పోస్ట్ ఇదిగో..

ఇదే సమయంలో మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ .. తమ బిడ్డలకు ఏం పేరు పెట్టాలన్నది తల్లిదండ్రుల నిర్ణయం అని, దీనిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదంటూ ట్రోలర్స్ కు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి దీపిక పదుకొణెల కూతురి పేరు దువా పదుకొణె సింగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సింగం అగైన్ సినిమాలో దీపిక పదుకొణె..

డెలివరీకి ముందు దీపిక మెటర్నీటీ షూట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.