AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యా.. అయ్యా ఒక్క హిట్ కొట్టండయ్యా..! అఖిల్ , పూరిజగన్నాథ్ కాంబోలో సినిమా.?

ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో అఖిల్ బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పటివరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు అఖిల్. అయితే అఖిల్ ఎవరితో సినిమా చేస్తున్నాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయ్యా.. అయ్యా ఒక్క హిట్ కొట్టండయ్యా..! అఖిల్ , పూరిజగన్నాథ్ కాంబోలో సినిమా.?
Puri Jagannadh, Akhil
Rajeev Rayala
|

Updated on: Nov 06, 2024 | 10:24 AM

Share

చాలా కాలంగా అక్కినేని కుర్ర హీరో అఖిల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వరుసగా సినిమాలు చేసినా కూడా అఖిల్ కు హిట్ మాత్రం దక్కడం లేదు. అఖిల్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ డైరెక్టర్ వీవీ వినాయక్ అఖిల్ ను హీరోగా పరిచయం చేశాడు. కానీ ఆ సినిమా సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆతర్వాత వరుసగా హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ సినిమాలు చేశాడు. కాగా వీటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది. కానీ ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో అఖిల్ బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పటివరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు అఖిల్. అయితే అఖిల్ ఎవరితో సినిమా చేస్తున్నాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

అయితే ఎట్టకేలకు అఖిల్ ఇప్పుడు సినిమా చేయడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది. అఖిల్ ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని ఇండస్ట్రీ టాక్. ఆ దర్శకుడు ఎవరో కాదు.. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్. ఈ స్టార్ డైరెక్టర్ కూడా హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూరి. ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్నారు.

ఇది కూడా చదవండి : Ottesi Cheputunna: అమ్మబాబోయ్..! ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ షాకింగ్ లుక్..

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఆతర్వాత రామ్ తో కలిసి డబుల్ ఇస్మార్ట్ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు హిట్ కొట్టి మరోసారి సత్తా చాటాలని చూస్తున్నారు పూరిజగన్నాథ్. ఇక ఇప్పుడు అఖిల్, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం పూరి ఇప్పటికే అదిరిపోయే స్టోరీని రెడీ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాతో అటు పూరి.. ఇటు అఖిల్ ఇద్దరూ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అయ్యా.. అయ్యా ఒక్క హిట్ కొట్టండయ్యా..! అంటూ కామెంట్స్ చూస్తున్నారు. మరి చూడాలి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది..

ఇది కూడా చదవండి :Shivaji : శివాజీ సినిమాలోని అక్కమ్మ జక్కమ్మలు గుర్తున్నారా.? ఈ ఇద్దరూ బయట ఏలా ఉంటారో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..