Ottesi Cheputunna: అమ్మబాబోయ్..! ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ షాకింగ్ లుక్..

2003లో వచ్చిన ఒట్టేసి చెపుతున్నా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. శ్రీకాంత్, స్రవంతి, శివాజీ, సునీల్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా మంచి లవ్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించింది.

Ottesi Cheputunna: అమ్మబాబోయ్..! ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ షాకింగ్ లుక్..
Ottesi Cheputunna
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 05, 2024 | 11:57 AM

చాలా మంది సీనియర్ హీరోలు ఇప్పుడు విలన్స్ గా.. లేదా సాహాయక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో శ్రీకాంత్ ఒకరు. శ్రీకాంత్ ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. శ్రీకాంత్ హీరోగా నటించిన సినిమాల్లో ఒట్టేసి చెపుతున్నా సినిమా ఒకటి. 2003లో వచ్చిన ఒట్టేసి చెపుతున్నా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. శ్రీకాంత్, స్రవంతి, శివాజీ, సునీల్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా మంచి లవ్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాకు ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.? అందంతో పాటు నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

ఈ చిన్నదాని పేరు కనిహా సుబ్రమణ్యం. ఈ సినిమాలో తన అందం అభినయంతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. చెన్నైకు చెందిన కనిహ మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. అయితే చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండడంతో మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. మోడల్ గా రాణించిన ఈ అమ్మడు.. 2001లో జరిగిన అందాల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తర్వాత అంటే 2002లో మణిరత్నం నిర్మించిన ఫైవ్ స్టార్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది.

ఇది కూడా చదవండి : Bhanu Priya: ఇదేందయ్యా ఇది.. ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాను ప్రియా చెల్లెలా..!!

ఆ తర్వాత ఒట్టేసి చెబుతున్నా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. ఒట్టేసి చెబుతున్నా తర్వాత నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమెరీస్ చిత్రంలో రవితేజకు భార్యగా నటించింది. తెలుగులో ఈ రెండు సినిమాలు మాత్రమే చేసింది ఈ అమ్మడు. ఆతర్వాత టాలీవుడ్ కు దూరం అయ్యింది. 2008లో అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్యామ్ రాధాకృష్ణన్‌ ను పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ. సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి :Devara : అవకాశాలు పెరిగాయి.. ఎలాంటి పాత్ర అయినా రెడీ అంటున్న దేవర బ్యూటీ..!

View this post on Instagram

A post shared by Kaniha (@kaniha_official)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!