AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara : అవకాశాలు పెరిగాయి.. ఎలాంటి పాత్ర అయినా రెడీ అంటున్న దేవర బ్యూటీ..!

దేవర 1 ను సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల చేశారు. కాగా ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దేవర సినిమాతో తారక్ నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటించింది.

Devara : అవకాశాలు పెరిగాయి.. ఎలాంటి పాత్ర అయినా రెడీ అంటున్న దేవర బ్యూటీ..!
Latha Reddy
Rajeev Rayala
|

Updated on: Nov 04, 2024 | 12:05 PM

Share

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా నందమూరి అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దేవర సినిమాను రెండు భాగాలూ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో దేవర 1 ను సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల చేశారు. కాగా ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దేవర సినిమాతో తారక్ నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. దేవర ఘనవిజయం సాధించడంతో ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి : సూపరో సూపర్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్

ఇదిలా ఉంటే దేవర సినిమాలో నటీ నటుల్లో లతా విశ్వనాథ్ రెడ్డి ఒకరు. ఈ అమ్మడు దేవర సినిమాలో కనిపించింది కొంత సేపే అయినా కూడా చాలా మందికి ఫేవరెట్‌గా మారిపోయింది ఈ చిన్నది. చాలా సినిమాల్లో ఈ చిన్నది ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేసింది. కానీ దేవర సినిమాతో లతా విశ్వనాథ్ రెడ్డికి మంచి క్రేజ్ వచ్చింది. చాల ఏమండీ ఈ ముద్దుగుమ్మ కోసం గూగుల్ లో గాలించారు. లతా విశ్వనాథ్ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ ఫొటోలతో నెటిజన్స్ ను కవ్విస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Tollywood : అమ్మబాబోయ్..! రచ్చ రచ్చ చేస్తుందిగా..!! ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోయిన్ గుర్తుందా..?

తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని తెలిపింది. దేవర సినిమాలో నటించడం అదృష్టం అని తెలిపిన ఈ అమ్మడు ఎన్టీఆర్ తో సీన్స్ లేకవడం బాధగా అనిపించింది అని తెలిపింది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ అలాగే.. కాంతారా హీరో రిషబ్ శెట్టి సరసన రొమాన్స్ చేయాలని తన మనసులోని మాట బయట పెట్టింది. ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. సినిమాలలో, వెబ్ సిరీస్ లలో అవకాశాలు వస్తున్నాయని, అలాగే లీడ్ రోల్స్ కూడా వస్తున్నాయని..లీడ్ రోల్స్, సైడ్ హీరోయిన్, స్పెషల్ సాంగ్స్  ఛాన్స్ లు వస్తున్నాయని.. ఎలాంటి రోల్స్ అయినా సరే తాను సిద్ధం అంటుంది ఈ భామ. ఎక్స్పోజింగ్ పాత్రలో నటించడం కాస్త ఇబ్బందిగా ఉన్న.. తనకు నటన వచ్చు కాబట్టి ఈజీనే అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఇది కూడా చదవండి : ఈ హీరోలను గుర్తుపట్టారా.? పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..