Tollywood : అమ్మబాబోయ్..! రచ్చ రచ్చ చేస్తుందిగా..!! ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోయిన్ గుర్తుందా..?

యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ప్రేక్షకులను పలకరించాడు. అంతకు ముందు కొన్ని హిందీ సినిమాలు చేశాడు.

Tollywood : అమ్మబాబోయ్..! రచ్చ రచ్చ చేస్తుందిగా..!! ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోయిన్ గుర్తుందా..?
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 02, 2024 | 10:42 AM

నవీన్ పోలిశెట్టి.. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా ప్రస్తుతం సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చాడు. నవీన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ప్రేక్షకులను పలకరించాడు. అంతకు ముందు కొన్ని హిందీ సినిమాలు చేశాడు. అలాగే మన తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో నటించాడు నవీన్ పోలిశెట్టి. డి ఫర్ దోపిడీ, నేనొక్కడినే సినిమాల్లోనూ నటించాడు. ఇక ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మరి హిట్ అందుకున్నాడు. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఇది కూడా చదవండి : Ram Charan: ఏంటీ ఈ సాంగ్ పాడింది రామ్ చరణా…! వింటే ఫ్యాన్స్‌కు పూనకాలే

ఈ సినిమాలో నవీన్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. 2019లో విడుదలైన ఈ సినిమాను కామెడీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌‌గా ఈ సినిమా తెరకెక్కింది. నెల్లూరు కు చెందిన ఒక క్రైం ఇన్వెస్టిగేటివ్‌ నేపధ్యంగా ఈ కథ సాగుతుంది. ఇందులో దాదాపు అందరూ కొత్త నటులు నటించారు. స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అలాగే ఈ సినిమాకు కథను హీరో నవీన్ అందించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మడు గుర్తుందా.? తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది ఆమె. ఆ చిన్నదాని పేరు శ్రుతి శర్మ. ఈ ముద్దుగుమ్మ మోడల్‌గాకెరీర్ ప్రారంభించి ఆతర్వాత హీరోయిన్ గా మారింది.

ఇది కూడా చదవండి :ఈ అమ్మడు మామూల్ది కాదుగా.. ఏకంగా ఐలాండ్‌నే కొనేసిన హాట్ బ్యూటీ

ఈ అమ్మడు టెలివిజన్ లో చేసింది. బిగ్ బాస్ హిందీ లోనూ పాల్గొంది ఈ చిన్నది. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. అలాగే హిందీలో పగ్గలైట్ అనే సినిమా చేసింది. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన హీరామండి: డైమండ్ బజార్ సినిమాలోనూ నటించింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

在 Instagram 查看这篇帖子

Shruti Sharma (@shrutiisharmaa) 分享的帖子

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.