Unstoppable With NBK S4: అన్ స్టాపబుల్ షోలో కన్నీళ్లు పెట్టుకున్న సూర్య.. బాలయ్య కూడా..

ఇప్పటికే అన్ స్టాపబుల్ టాక్ షో విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 4 కూడా సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఇప్పటికే సీజన్ 4లో ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి గెస్ట్ గా హాజరయ్యారు.

Unstoppable With NBK S4: అన్ స్టాపబుల్ షోలో కన్నీళ్లు పెట్టుకున్న సూర్య.. బాలయ్య కూడా..
Unstoppable With Nbk S4
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 05, 2024 | 11:31 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్ గా కూడా చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ అనే టాక్ షోకు బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ టాక్ షో విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 4 కూడా సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఇప్పటికే సీజన్ 4లో ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి గెస్ట్ గా హాజరయ్యారు. అలాగే సెకండ్ ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ మూవీ అలాగే టీమ్ దుల్కర్ సల్మాన్ హాజరయ్యి సందడి చేశారు. ఇక ఇప్పుడు కంగువ మూవీ టీమ్ హాజరయ్యారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోను ఆహా రిలీజ్ చేశారు.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

హీరో సూర్యతో బాలకృష్ణ సందడి చేశారు. ” నేను సింహం అయితే అతను సింగం, నేను లెజెండ్ అయితే అతను గజినీ, నేను అఖండ అయితే అతను రోలెక్స్” అంటూ సూర్యకు అదిరిపోయే ఇంట్రో ఇచ్చారు బాలయ్య. ఆ తర్వాత సూర్యతో సరదా ముచ్చటలతో.. తికమక పెట్టే ప్రశ్నలతో సూర్యను ఇరకాటంలో పెట్టారు. కార్తీ ఫోన్ లో సూర్య పేరు ఏమని సేవ్ చేసి ఉంటుంది అని సూర్యను అడిగారు బాలయ్య.

ఇది కూడా చదవండి : Bhanu Priya: ఇదేందయ్యా ఇది.. ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాను ప్రియా చెల్లెలా..!!

అలాగే సూర్య , కార్తీకి మధ్య గొడవైన లాస్ట్ టాపిక్ ఏంటి.? నీ ఫస్ట్ క్రష్ ఎవరు.? అంటూ సూర్యను ఆడుకున్నారు బాలయ్య. అలాగే కార్తీకి ఫోన్ చేసి మీ అన్నయ్య చాలా అబద్దాలు ఆడారు అని చెప్పగానే కార్తీ కూడా చిన్నప్పటి నుంచి అంతే సార్ అంటూ కౌంటర్ వేశాడు. అలాగే ఓ నటి అంటే ఆయనకు చాలా ఇష్టం సార్ అని కార్తీ అంటే.. వెంటనే సూర్య నువ్వు కార్తీ కాదు రా.. కత్తి అని డైలాగ్ వేశారు. ఇలా సరదాగా సాగుతుండగానే సూర్య సమాజ సేవగురించి కూడా బాలయ్య మాట్లాడారు. సూర్య ఓ అమ్మాయి సాయం చేయగా.. ఆమె చెప్పిన మాటలను వీడియో రూపంలో చూపించారు బాలకృష్ణ. ఆ అమ్మాయి మాటలు వింటూ సూర్య కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలకృష్ణ కూడా నాకు కన్నీళ్లు వస్తున్నాయి అని అన్నారు. ఇక తమిళనాడులో చాలా మంది ఫండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అలాగే తెలుగు నుంచి కూడా దాదాపు సగంమంది జనాలు ఫండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు అని సూర్య అన్నారు. ఇక చివరిలో కంగువ దర్శకుడు శివ, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా బాలయ్య షోలో ఎంట్రీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి :Devara : అవకాశాలు పెరిగాయి.. ఎలాంటి పాత్ర అయినా రెడీ అంటున్న దేవర బ్యూటీ..!

అన్ స్టాపబుల్ సీజన్ 4

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.