Actress Kasthuri: నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం.. యాక్షన్‌లోకి పోలీసులు

కయ్యమేల కస్తూరీ..! అని సున్నితంగా హెచ్చరిస్తోంది ఆమె అభిమాన గణం. ఇంటింటి గృహలక్ష్మిగా తెలుగు లోగిళ్లందరికీ పరిచయమున్న కస్తూరి శంకర్.. ఇప్పుడు నోటి దురుసు కారణంగా కాసేపు దోషిగా నిలబడాల్సి వచ్చింది. తర్వాత సంజాయిషీ ఇచ్చుకున్నా.. ఆ మాటతో జరిగిన డ్యామేజ్ మాత్రం తగ్గినట్టు లేదు.

Actress Kasthuri: నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం.. యాక్షన్‌లోకి పోలీసులు
Kasthuri
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 06, 2024 | 9:45 AM

నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తెలుగువారిని కించపరుస్తూ రెండు రోజుల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేశారామె. కస్తూరిపై తెలుగు సంఘాలు ఇచ్చిన ఫిర్యాదుపై యాక్షన్‌లోకి దిగారు చెన్నై పోలీసులు. 300 ఏళ్ల క్రితం అంతఃపురంలో మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు తమిళనాడుకు వచ్చి.. వారు తమిళులుగా చలామణి అయ్యారని కస్తూరి కామెంట్ చేశారు. దీంతో అగ్గి రాజుకుంది. తమిళనాడులో పలు జిల్లాల్లో తెలుగు నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై ఎగ్మూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు ఈ అంశంపై నటి కస్తూరి క్షమాపణ కోరారు. తెలుగు భాషతో ప్రత్యేక బంధం ఉండటం అదృష్టమన్నారు. తెలుగు ప్రజలు తనకు పేరు, ప్రతిష్ట, కుటుంబాన్ని ఇచ్చారని తెలిపారు. తాను మాట్లాడింది ప్రత్యేకించి కొందరి గురించేనని, తెలుగు ప్రజలందరినీ కాదని మళ్లీ ఒకసారి చెబుతున్నానన్నారు.  తెలుగు కుటుంబాలను గాయపరచటం తన ఉద్దేశం కాదని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానన్నారు.

ఇటీవలే రాజీయాల్లో ఎంట్రీ ఇచ్చారు కస్తూరి. కమలం పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. ట్విట్టర్‌ ఖాతా కోసమో.. ఇంగ్లీష్ పత్రికల కోసమో అప్పుడప్పుడూ సోషల్ ఇష్యూస్ మీద కాలమ్స్‌ రాస్తారు కూడా. తెలుగు టీవీ సీరియల్స్‌తో గ్లామర్ ఇండస్ట్రీలో లైమ్‌లైట్‌లోకొచ్చి.. రీల్సూ గట్రా చేస్తూ.. మళ్లీ ఫేమస్సయ్యారు. అలా వచ్చిన పాపులారిటీకి తనదైన నోటి దురుసు యాడైంది. ఇంకేముంది.. సీజనుకో స్టేట్‌మెంట్‌తో కాంట్రవర్సియల్ క్వీన్ అనే పేరు తెచ్చుకుంది కస్తూరి శంకర్. లేటెస్ట్‌గా ఒక వేదిక మీద నుంచి ఆమె చేసిన సీరియస్ ఎలిగేషన్లు.. తెలుగు సొసైటీని సూటిగా తాకేశాయి.

కస్తూరి.. కులతః బ్రాహ్మణ యువతి. బ్రాహ్మణ సమాజం నేతృత్వంలో జరిగే ఒక సభావేదిక మీద మాట్లాడే అవకాశం వచ్చింది. ఆవిధంగా సొంత సామాజికవర్గాన్ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నంతో ఆమె ఇలా నోరు జారేశారు. అసలైన తమిళులు ఎవరు? అనే సబ్జెక్ట్ మీద క్లారిటీ ఇవ్వబోయి తెలుగువాళ్ల మూలాల్ని ప్రశ్నించారు కస్తూరి మేడమ్. అక్కడితోనే ఆగలేదు.. తమిళుల మీద తెలుగోళ్లకెందుకు పెత్తనం.. అని లాజిక్కులు తీశారు.

గతంలో మహారాష్ట్రలో శివసేన కూడా హిందుత్వ పేరుతో నాన్‌మరాఠీల్ని, ముఖ్యంగా తెలుగువాళ్లను కించపరుస్తూ రచ్చకెక్కింది. ఇప్పుడు కస్తూరి పాల్పడింది కూడా అటువంటి దుస్సాహసమే. ఆమెపై బీజేపీ చర్యలు తీసుకోవాలని, లేదంటే తమిళసమాజంలో తెలుగువారి మీద దురభిప్రాయం కలిగే ప్రమాదం ఉందని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. శ్రీలంకలో తమిళుల పట్ల సింహళీయులు చిన్నచూపు చూడ్డం ఒక యుద్ధానికే దారితీసింది.

ప్రాంతీయతత్వం ఎవరికైనా ఉంటుంది.. కానీ.. ఒక ప్రాంతానికి చెందినవారిని మరో ప్రాంతం మీదకు రెచ్చగొట్టడం అంటే దేశద్రోహం కిందకే వస్తుంది. గతంలో అరబ్బులను దోపిడీ దొంగలుగా.. పఠాన్లను బూచోళ్లుగా చూపించే ప్రయత్నం సినిమాల్లో జరిగేది. కథలు-క్యారెక్టర్ల కోసం అలా వెంపర్లాడేవారు. కానీ.. రీల్‌లైఫ్‌ వేరు- రియల్ లైఫ్‌ వేరు. నిజానికి.. తమిళనాట వేళ్లూనుకుపోయిన డ్రవిడ ఉద్యమాన్ని ప్రశ్నించడం మాత్రమే కస్తూరి ఉద్దేశం. కానీ.. డ్రవిడియన్ మూమెంట్ బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించింది తప్ప.. బ్రాహ్మణుల్ని దూరం పెట్టలేదని ఆమె తెలుసుకోవాలంటున్నాయి ద్రవిడ పార్టీలు. కస్తూరి చేసింది కచ్చితంగా అసందర్భ ప్రేలాపనే అనే వాదన క్రమంగా బలపడుతోంది. తమిళనాట తెలుగు సంఘాలైతే కస్తూరి మీద కస్సుమంటున్నాయి.

ఇలా.. ఖబడ్దార్ సౌండ్లతో గొడవ ముదిరి రెండు రాష్ట్రాలను కుదిపేస్తున్న వేళ.. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు కస్తూరి శంకర్. వాస్తవాన్ని వివరిస్తూనే.. వక్రీకరణ వెనుక అసలు నిజం ఇదీ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమిళనాడులోని డీఎంకే పార్టీ సానుభూతిపరులే కుట్ర చేశారని, తన వ్యాఖ్యల్ని అదేపనిగా వక్రీకరిస్తున్నారని కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారామె.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్