AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు భయపడని సల్మాన్.. హైదరాబాద్‌లో రష్మికతో కలిసి షూటింగ్.. వీడియో చూడండి

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు మరో బెదిరింపు లేఖ వచ్చింది. 5 కోట్ల రూపాయలు లేదా బిష్ణోయ్ ఆలయానికి వెళ్లి క్షమాపణ చెప్పాలని అందులో డిమాండ్ చేశారు. అయితే ఈ బెదిరింపును పట్టించుకోకుండా హైదరాబాద్‌లో 'సికిందర్' షూటింగ్ కొనసాగించాడు సల్మాన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Salman Khan: బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు భయపడని సల్మాన్.. హైదరాబాద్‌లో రష్మికతో కలిసి షూటింగ్.. వీడియో చూడండి
Salman Khan, Rahsmika Mandanna
Basha Shek
| Edited By: Rajeev Rayala|

Updated on: Nov 06, 2024 | 9:02 AM

Share

గత కొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్‌కు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా 5 కోట్లు చెల్లించాలని లేదంటే బిష్ణోయ్ గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మరో బెదిరింపు లేఖ పంపారు. అయితే బెదిరింపులను పట్టించుకోకుండా సల్మాన్ ఖాన్ షూటింగ్ లో నిమగ్నమయ్యాడు. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం సికిందర్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు పొంచి ఉంది. కృష్ణజింకలను చంపిన కేసులో సల్మాన్ ఖాన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని బిష్ణోయ్ గ్యాంగ్ పట్టుబట్టారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌కి కొత్త ముప్పు వచ్చింది. ‘సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ ఆలయానికి వెళ్లి జరిగిన తప్పుకు క్షమాపణలు చెప్పాలి లేదా రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వాలి లేకుంటే సల్మాన్‌ను చంపేస్తాం’ అని బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు ఈ ఆరోపణ చేసినట్లు సమాచారం.

కాగా, సల్మాన్ ఖాన్ ‘సికందర్’ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉంటున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్యాలెస్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఈ షూట్ లో భాగమైంది. ఇప్పుడీ ఈ సినిమా షూట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇందులో సల్మాన్ ఖాన్ వ్యానిటీ వ్యాన్‌ నుంచి ప్యాలెస్ లోకి అడుగుపెట్టడం చూడవచ్చు. ఇక ఈ సినిమా సెట్స్‌లో సల్మాన్ లగ్జరీ కార్లు కూడా వచ్చాయి. . రోల్స్ రాయిస్ వంటి కార్లు సెట్ బయట పార్కింగ్ ప్లేస్ లో కనిపించాయి.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదే..

సికిందర్ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నతో పాటు కాజల్ అగర్వాల్ కూడా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ‘సింగం ఎగైన్’ సినిమాలోనూ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.