Ananya Nagalla: ‘వేణు స్వామిని అందుకే కలిశాను’.. అసలు విషయం చెప్పేసిన అనన్య నాగళ్ల

మల్లేశం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది అనన్య నాగళ్ల. తెలంగాణ ప్రాంతానికి ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో నటించిన వకీల్ సాబ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే పొట్టేల్ సినిమాతో మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది అనన్య.

Ananya Nagalla: 'వేణు స్వామిని అందుకే కలిశాను'.. అసలు విషయం చెప్పేసిన అనన్య నాగళ్ల
Venu Swamy, Ananya Nagalla
Follow us
Basha Shek

|

Updated on: Nov 06, 2024 | 8:20 AM

పేరుకు తెలుగు సినిమా ఇండస్ట్రీనే అయినా ఇక్కడ తెలుగు హీరోయిన్లు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన అనన్య నాగళ్ల ఒకరు. మల్లేశం సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ వకీల్ సాబ్, శాకుంతలం, యశోద, మ్యాస్ట్రో సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా కాకుండానే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మెప్పిస్తోంది. ఇటీవల అనన్య నటించిన తాజా చిత్రం పొట్టేల్. అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. అయితే పొట్టేల్ కు ముందు తంత్రం అనే ఓ హారర్ సినిమాలో నటించింది అనన్య. క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంలో అనన్య ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామిని కలవడం చర్చనీయాంశంగా మారంది. వీరి ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. తాజాగా ఈ విషయంపై స్పందించింది అనన్య. వేణు స్వామిని కలవడానికి గల కారణాలను పంచుకుంది.

కాగా గతంలో డింపుల్ హయాతి, నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మిక, నిధి ఆగర్వాల్, బిగ్‌బాస్‌ ఇనయ సుల్తానా, అషూ రెడ్డి తదితర హీరోయిన్లు వేణు స్వామితో పూజలు చేయించుకున్నారు. ఇదే విషయంపై అనన్య స్పందిస్తూ.. ‘ సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ తో పాటు అద్రుష్టం కూడా ఉండాలని, ఆ రెండు కలసి ఉంటేనే సక్సెస్ అవుతామన్నారు. ఇక జాతకాలపై మాట్లాడుతూ ఇప్పటివరకు తాను ఎవరి దగ్గరా జాతకాలు చెప్పించుకోలేదని, తనకు అలాంటి అవకాశం, అలాంటి ఆలోచనలు అని రాలేదనీ, చిన్నప్పటినుండి జాతకాలను పట్టించుకోనని కరాఖండిగా చెప్పేసింది.

ఇవి కూడా చదవండి

దీపావళి వేడుకల్లో అనన్య నాగళ్ల..

ఇక వేణు స్వామిని కలవడంపై స్పందిస్తూ.. తంత్రి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాను నేను స్వామి దగ్గరికి వెళ్ళానని, కానీ తన జాతకాన్ని చూపించుకోలేదన్నారు. కేవలం మూవీ ప్రమోషన్ కోసం మాత్రమే తాను వెళ్లానని, ఆయన కూడా తనని పూజల కోసం పిలవలేదని స్పష్టంగా చెప్పుకొచ్చింది అనన్య.

అనన్య నాగళ్ల గ్లామరస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.