సీఎం మనవడితో పెళ్లి క్యాన్సిల్.. ఇప్పుడు సినిమా ఛాన్సులు కూడా కరువు.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

కెరీర్ ప్రారంభంలో వరుసగా సినిమాలు చేసింది. అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. అయితే ఉన్నట్లుండి ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు సన్నగిల్లిపోయాయి.

సీఎం మనవడితో పెళ్లి క్యాన్సిల్.. ఇప్పుడు సినిమా ఛాన్సులు కూడా కరువు.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Nov 06, 2024 | 7:46 AM

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? కొన్ని నెలల క్రితం వరకు ఈ అమ్మాయి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. పుట్టి పెరిగింది పంజాబ్‌లోనే అయినా తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నాని, శర్వానంద్, వరుణ్ తేజ్, రవితేజ, వెంకటేష్, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాగ శౌర్య తదితర క్రేజీ హీరోలతో సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈ ముద్దుగుమ్మ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. హరియాణాకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో నిశ్చితార్థం చేసుకుంది. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఉన్నట్లుండి ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. అప్పటివరకు క్రేజీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీకి క్రమంగా సినిమా ఛాన్సులు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ సొగసరి చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ కూడా. తెలుగులో ఆమెను చాలా మంది ఒక ముద్దు పేరుతో పిలుస్తారు. తన ఒరిజినిల్ పేరు కంటే హనీ అని క్యూట్ గా పిలుస్తారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ ఆమె మరెవరో కాదు ఎఫ్‌2 సినిమాలో హనీగా నవ్వులు పంచిన మెహ్రీన్ పిర్జాదా. మంగళవారం (నవంబర్ 05) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెప్పారు. అదే సమయంలో మెహ్రీన్ చిన్ననాటి ఫొటోలు నెట్టింట బాగా ట్రెండ్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

పంజాబ్ కు చెందిన మెహ్రీన్ పదేళ్లకే ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకుంది. 2013లో టొరంటోలో జరిగిన మిస్ పర్సనాలిటీ సౌత్ ఆసియా కెనడా పోటీలో విజేత గా నిలిచింది. ఆ తర్వాత కొన్ని కమర్షియల్ యాడ్స్ లో నటించింది. ఇక నాని హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఎఫ్ 2 సినిమాలో ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ మెహ్రీన్ చెప్పిన క్యూట్ డైలాగ్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది.

మెహ్రీన్ లేటెస్ట్ ఫొటోస్..

సినిమాల సంగతి పక్కన పెడితే.. 2021లో హర్యానాకి చెందిన భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది మెహ్రీన్. హర్యానాకి గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య. అయితే కారణమేంటో తెలీదు గానీ మెహ్రీన్-భవ్య బిష్ణోయ్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇక అప్పటినుంచే మెహ్రీన్ సినిమాలు కూడా బోల్తా కొట్టాయి. గతేడాది రిలీజైన స్కార్క్ అనే సినిమాలో చివరిసారిగా కనిపించిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మెహ్రీన్ ఒక కన్నడ సినిమా మాత్రమే చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2025 పెళ్లికి సిద్ధమవుతున్న ముగ్గురు హీరోయిన్లు
2025 పెళ్లికి సిద్ధమవుతున్న ముగ్గురు హీరోయిన్లు
అమెరికాలో కార్చిచ్చు.. మంటల్లో బూడిదైన హాలీవుడ్‌ తారల ఆస్తులు
అమెరికాలో కార్చిచ్చు.. మంటల్లో బూడిదైన హాలీవుడ్‌ తారల ఆస్తులు
బడికి సెలవిస్తారనీ ఓ విద్యార్ధి ఆకతాయిపనికి.. ఢిల్లీ సర్కార్ గజగజ
బడికి సెలవిస్తారనీ ఓ విద్యార్ధి ఆకతాయిపనికి.. ఢిల్లీ సర్కార్ గజగజ
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రాను తప్పించండి.. ధోని దోస్త్ డిమాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రాను తప్పించండి.. ధోని దోస్త్ డిమాండ్
టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్.. మరి స్టార్ స్టేటస్ అందుకుంటారా?
టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్.. మరి స్టార్ స్టేటస్ అందుకుంటారా?
గవర్నమెంట్ ఆఫీసులో సీఎం ఫోటోతో ఇలానా..?
గవర్నమెంట్ ఆఫీసులో సీఎం ఫోటోతో ఇలానా..?
ఏంది భయ్యా అది.. మేక, గొర్రెనో తోలినట్లుగా సింహాన్ని తరిమేశావ్..
ఏంది భయ్యా అది.. మేక, గొర్రెనో తోలినట్లుగా సింహాన్ని తరిమేశావ్..
సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సినిమా.. ?
సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సినిమా.. ?
ఒక్క సినిమాతోనే 10 వేల కోట్లు వసూలు సాధించిన ఏకైక హీరోయిన్..
ఒక్క సినిమాతోనే 10 వేల కోట్లు వసూలు సాధించిన ఏకైక హీరోయిన్..
IPLకి ముందు మాక్స్‌వెల్ ‘బ్లాస్టింగ్’ ఇన్నింగ్స్..
IPLకి ముందు మాక్స్‌వెల్ ‘బ్లాస్టింగ్’ ఇన్నింగ్స్..