Bigg Boss Telugu 8: హౌస్‌లో ట్రైయాంగిల్ స్టోరీ.. అసలు ఏం జరుగుతుందిరా బాబు..!

బిగ్ బాస్ హౌస్ లో ట్రైయాంగిల్ స్టోరీ రోజుకొక మలుపు తిరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో యష్మీ , గౌతమ్ దగ్గర ఒకలా మాట్లాడిన నిఖిల్. ఆతర్వాత విష్ణు ప్రియా దగ్గర మాత్రం ప్లేట్ తిప్పేశాడు.

Bigg Boss Telugu 8: హౌస్‌లో ట్రైయాంగిల్ స్టోరీ.. అసలు ఏం జరుగుతుందిరా బాబు..!
Bigg Boss 8
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 06, 2024 | 7:33 AM

నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. దాంతో హౌస్ మేట్స్ డిస్కషన్స్ మొదలు పెట్టారు. ఇక యష్మీని హగ్ చేసుకొని నిఖిల్ ఎందుకు గౌతమ్ అక్కా అన్న టాపిక్ తీశావురా వేస్ట్‌గా అని అన్నాడు. దానికి యష్మీ తీయాలిరా మీరిద్దరూ ఎంత సేపు మాట్లాడారు అక్కా అనే టాపిక్ మీద.. అది బ్యాడ్‌గా వెళ్తుంది బయటికి. అంటూ సమాధానం చెప్పింది యష్మీ. దీని గురించి ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఇంతలో అక్కడికి గౌతమ్ వచ్చాడు. “రేయ్ స్వాతిముత్యం మీకు అర్థం కావట్లే.. అక్కడే ఏదైతే బయట చెప్తున్నారో అదే బయట పోట్రే అవుతుంది.. మీకు అర్థం కావట్లే..” అని నిఖిల్ తో అన్నాడు గౌతమ్. దానికి యష్మీ ఎదో చెప్పింది. ఆతర్వాత నిఖిల్ జనాలు అలా అనుకుంటారు ఇలా అనుకుంటారని ఒకవేళ ఎవరికైనా థాట్ ఉంటే ఒకరితో కూడా మాట్లాడకూడదు నన్ను అడిగితే.. అనుకునే వాళ్లు వంద అనుకుంటారు.. వాటన్నింటికీ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి బతకడానికి అయితే రాలేదు ఎవరూ ఇక్కడ.. అని డైలాగ్ కొట్టాడు.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

ఆతర్వాత విష్ణు ప్రియా దగ్గరకు వెళ్లి డిస్కషన్ పెట్టాడు నిఖిల్.. యష్మీ , గౌతమ్ దగ్గర ఒకలా మాట్లాడిన నిఖిల్.. విష్ణు దగ్గర మరోలా మాట్లాడాడు. ట్రైయాంగిల్ స్టోరీ నన్ను ఎఫెక్ట్ చేస్తుంది.. కదా.. నేను అక్కడ నిల్చొని మాట్లాడాల్సిందా లేక తప్పయిందా..బయట నా వాళ్లు ఉన్నారు నాగురించి ఏమనుకుంటారు. అంటూ విష్ణు దగ్గర చెప్పుకొచ్చాడు నిఖిల్.

ఇది కూడా చదవండి : Ottesi Cheputunna: అమ్మబాబోయ్..! ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ షాకింగ్ లుక్..

యష్మీ-గౌతమ్ ముందు బయట జనాలు ఏమనుకుంటే మనకెందుకు.. బయట వాళ్లు అనుకునేవాటికి వాటన్నింటికీ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి బతకడానికి రాలేదు అని డైలాగ్ కొట్టిన నిఖిల్.. విష్ణు ప్రియా దగ్గర మాత్రం “నేను ఓ క్లారిటీ ఇవ్వాల్సింది.. జనాలికి కూడా తెలిస్తుంది ఏంటంటే నాకు కావాల్సిన వాళ్లు బయట ఉన్నారని డైలాగ్స్ కొట్టాడు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో ట్రైయాంగిల్ స్టోరీ రన్ అవుతుంది. అసలు ఈ ముగ్గురిలో ఎవరు.. ఎవరివైపు మాట్లాడుతున్నారో.. ఏం మాట్లాడుతున్నారో.. అసలు వీరి మధ్య ఏం జరుగుతుందో చూసే ప్రేక్షకులకు ఏం అర్ధం కావడం లేదు.

ఇది కూడా చదవండి :Shivaji : శివాజీ సినిమాలోని అక్కమ్మ జక్కమ్మలు గుర్తున్నారా.? ఈ ఇద్దరూ బయట ఏలా ఉంటారో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.