Janhvi Kapoor: అమీర్‌పేట హనుమాన్ టెంపుల్‌లో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు.. వీడియో చూడండి

దేవర సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఇందులో ఆమె పోషించిన తంగం పాత్రకు మంచి పేరు వచ్చింది. దీని తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తోంది జూనియర్ శ్రీదేవి.

Janhvi Kapoor: అమీర్‌పేట హనుమాన్ టెంపుల్‌లో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు.. వీడియో చూడండి
Janhvi Kapoor
Follow us
Basha Shek

|

Updated on: Nov 07, 2024 | 1:03 PM

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు గ్లామరస్ పాత్రలు పోషిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో మెరిసింది. ఇక ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది జాన్వీ. తంగం పాత్రకు మంచి పేరు రావడం, సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో జాన్వీ పాపకు తెలుగులోనే మరిన్ని అవకాశాలు వస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందీ అందాల తార. దీంతో పాటు నాని, నాగ చైతన్య తర్వాతి ప్రాజెక్టులోనూ జాన్వీ నటించనుందని ప్రచారం జరుగుతోంది. సినిమాల సంగతి పక్కన పెడితే జాన్వీకి భక్తి ఎక్కువే. అందుకే తన తల్లి పుట్టిన రోజు, అలాగే తన బర్త్ డే రోజున తప్పకుండా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటుంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా కోసం ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటోంది జూనియర్ శ్రీదేవి. షూటింగ్ నుంచి కాస్త విరామం, తీరికదొరికినప్పుడల్లా సిటీలోని గుళ్లను తిరగేస్తోందీ అందాల తార. తాజాగా హైదరాబాద్ హనుమాన్ టెంపుల్‌లోనూ ప్రత్యేక పూజలు చేసింది జాన్వీ.

తాజాగా గురువారం (నవంబర్ 07) అమీర్ పేట దగ్గరలోని మధురానగర్‌ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చింది జాన్వీ కపూర్. సుమారు అరగంట పాటు ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం ఈమెకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. జాన్వీ వచ్చిందని తెలిసి, గుడి దగ్గరకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

హనుమాన్ టెంపుల్ లో జాన్వీ కపూర్ పూజలు.. వీడియో..

కాగా ఉప్పెన బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ పరిసరాల్లో జరుగుతోంది.

రామ్ చరణ్ తో జాన్వీ కపూర్.. ఫొటోస్ ఇదిగో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!