AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్ పక్కా! మంజుల కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దివంగత నటుడు కృష్ణ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆయన సినీ వారసత్వాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు కొనసాగిస్తున్నాడు. ఇక కృష్ణ కూతురు మంజుల గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.

Mahesh Babu: మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్ పక్కా! మంజుల కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో!
Mahesh Babu Family
Basha Shek
|

Updated on: Nov 07, 2024 | 12:27 PM

Share

కృష్ణ కూతురు, మహేష్ బాబు సోదరిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంజుల ఘట్టమనేని. నటిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ..ఇలు పలు రంగాల్లో ఆమెకు ప్రావీణ్యముంది. ఇక మంజుల నటించి నిర్మించిన షో సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. దీంతో పాటు కావ్యాస్ డైర, ఆరెంజ్ ,సేవకుడు, మళ్లీ మొదలైంది, హంట్, మంత్ ఆఫ్ మధు తదితర సినిమాల్లో తళుక్కుమంది మంజుల. ఇదే క్రమంతో తన తల్లి పేరు మీదుగా ప్రారంభించిన ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పోకిరి, ఏ మాయ చేశావే వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించింది. ఇక సందీప్ కిషన్ తో కలిసి మనసుకు నచ్చింది అనే ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీకి దర్శకత్వం కూడా వహించింది. ఇలా మల్టీ ట్యాలెంటెడ్ వుమన్ గా పేరు తెచ్చుకున్న మంజుల సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. లైఫ్ స్టైల్ టిప్స్ తో పాటు అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది.అలా తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో మంజులతో పాటు ఆమె భర్త సంజయ్ స్వరూప్ కూతురు జాహ్నవి స్వరూప్ కూడా ఉన్నారు.

గతంలో చిన్నారిగా కనిపించిన జాహ్నవి ఇప్పుడు అచ్చం హీరోయిన్ లా కనిపిస్తుంది. తల్లిదండ్రులతో కలిసి ట్రెడిషనల్ వేర్ లో ఎంతో అందంగా కనిపిస్తున్న జాహ్నవి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు జాహ్నవి సినిమాల్లోకి వస్తే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కూతురుతో మంజుల దంపతులు..

కాగా గ‌తంలో మంజుల డైరెక్ట్ చేసిన మనసుకు నచ్చింది సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది జాహ్నవి. ఇదే ఆమెకు మొదట సినిమా. ఆ త‌ర్వాత మ‌రే సినిమాలోనూ మంజుల కూతురు న‌టించ‌లేదు. అయితే టీనేజ్ లో ఉన్న జాహ్న‌వి త‌న స్ట‌డీస్ ను కంప్లీట్ చేసే ప‌నిలో బిజీగా ఉందని తెలుస్తోంది. మరి భవిష్యత్‌లో జాహ్నవి సినిమాల్లోకి వస్తుందేమో ూడాలి.

సుధీర్ బాబు కుమారుడితో జాహ్నవి స్వరూప్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!