AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara OTT: ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి దేవర.. ఎక్కడ చూడొచ్చంటే?

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలో ప్రత్యక్షం కానుంది.

Devara OTT: ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి దేవర.. ఎక్కడ చూడొచ్చంటే?
Devara Movie
Basha Shek
|

Updated on: Nov 07, 2024 | 11:13 AM

Share

ఆర్ఆర్ఆర్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర తో అభిమానుల ముందుకు వచ్చాడు. గతంలో తనకు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన కొరటాల శివ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. అలాగే మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. అభిమానుల భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న విడుదలైన దేవర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రికార్డు స్థాయి వసూళ్లతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఓవరాల్ గా దేవర సినిమాకు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ ఇతర భాషల్లోనూ ఎన్టీఆర్ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికీ చాలా చోట్ల దేవర సినిమా థియేటర్లలో రన్ అవుతోంది. అయితే ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దేవర సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 8 నుంచి దేవరను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షం కానుందన్నమాట. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లోనూ దేవర సినిమా అందుబాటులోకి రానుంది.

ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దేవర సినిమాను నిర్మించాయి. శ్రుతి మరాఠే, తాళ్లూరి రామేశ్వరి, శ్రీకాంత్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, అజయ్ తదితరలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక అనిరుధ్ రవిచందర్ అందించిన స్వరాలు, బీజీఎమ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. కాగా దేవర సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు ఇది వరకే అనౌన్స్ చేశారు మేకర్స్. త్వరలోనే ఇది కూడా పట్టాలెక్కనుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్..

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే