Aha OTT: మీ దగ్గర కొత్త కథలు ఉన్నాయా..? అయితే యంగ్ రైటర్స్ కోసం ఆహా బంపర్ ఆఫర్..

సినీ ప్రియులను ఆకట్టుకోవడానికి నిరంతరం కొత్త కంటెంట్ తీసుకువస్తుంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా. ప్రేక్షకులు కోరుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ చిత్రాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. అలాగే అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా సినీ తారల కెరీర్, పర్సనల్ విషయాలను అభిమానుల ముందుకు తీసుకువస్తుంది. ఇక ఇప్పుడు కొత్త రచయితలకు మంచి అవకాశం కల్పిస్తుంది ఆహా.

Aha OTT: మీ దగ్గర కొత్త కథలు ఉన్నాయా..? అయితే యంగ్ రైటర్స్ కోసం ఆహా బంపర్ ఆఫర్..
Aha Ott
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 07, 2024 | 7:23 PM

ఆహా ఓటీటీ, నిర్మాత SKN ప్రొడక్షన్ హౌస్ మాస్ మూవీ మేకర్స్, దర్శకుడు సాయి రాజేష్ నిర్మాణ సంస్థ అమృత ప్రొడక్షన్స్ సహకారంతో కొత్త రచయితల కోసం ‘రైటర్స్ టాలెంట్ హంట్‌’ని ప్రకటించింది. కొత్త అభిరుచిగల రచయితల కోసం ‘టాలెంట్ హంట్’ను గురువారం ప్రకటించింది. మీ దగ్గర మంచి కథలు ఉన్నా కానీ అవకాశాలు రావడం లేదా.. ? కామెడీ, థ్రిల్లర్, డ్రామా, హర్రర్, రొమాన్స్, యాక్షన్‌తో సహా అనేక రకాల జానర్స్‏లో అద్భుతమైన స్టోరీలను రాసే యువ రచయితల టాలెంట్‏కు సరైన అవకాశం ఇవ్వడమే ఈ టాలెంట్ హంట్ లక్ష్యం. విభిన్న కథలు.. సరికొత్త ఆలోచనలను కనుగొనడానికి ఆహా చేస్తున్న ప్రయత్నమే ఈ రైటర్స్ టాలెంట్ హంట్.

ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ.. “అల్లు అరవింద్ గారు కొత్త ప్రతిభను కనుగొనడం.. వారికి సపోర్ట్ చేయడంపై ఎప్పుడూ దృష్టి పెట్టారు. ఇప్పటికే ఎంతోమంది ప్రతిభావంతులైన వ్యక్తులను వివిధ విభాగాల్లో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు ఆహా ఓటీటీ కూడా ప్రతిభావంతులైన వ్యక్తులకు మద్దతుగా ఉంటాము. మేము చాలా మంది ప్రతిభావంతులైన వ్యక్తులను పరిశ్రమకు విజయవంతంగా పరిచయం చేసాము. కొత్త ఆలోచనలు ఉన్న యువ రచయితలను గుర్తించి.. వారికి సహకరించాలనే ఆలోచనతో నిర్మాత SKNను కలిశాము. రచయితలకు, పరిశ్రమకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి మేము రచయితల టాలెంట్ హంట్‌ని ప్రారంభించాము. రాబోయే సినిమాలు, థియేట్రికల్ విడుదలలు, వెబ్ సిరీస్‌లు, మరిన్నింటిలో ప్రతిభావంతులైన రచయితలకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాము”అని అన్నారు.

ఈ రైటర్స్ టాలెంట్ హంట్ అన్ని స్థాయిల అనుభవం ఉన్న రచయితలకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గలవారు తమ కథలను విభిన్న శైలులలో సమర్పించవచ్చు. కథలు వాటి వాస్తవికత, సృజనాత్మకత, ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్‌లో విజయం సాధించగల సామర్థ్యంపై ఎంపిక చేయబడతాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు.. ఆహా అధికారిక ప్లాట్ ఫామ్, ఆహా సోషల్ మీడియా పేజీలలో అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

https://publish.twitter.com/?url=https://twitter.com/ahavideoIN/status/1854402164547846160#

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ