AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: ఈ సినిమా చేయను.. వెళ్లిపోతాను.. డైరెక్టర్‏తో గోల చేసిన ఎన్టీఆర్.. ఎందుకంటే..

ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం తారక్ హిందీలో వార్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా.. జూనియర్ ఎన్టీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

Jr.NTR: ఈ సినిమా చేయను.. వెళ్లిపోతాను.. డైరెక్టర్‏తో గోల చేసిన ఎన్టీఆర్.. ఎందుకంటే..
Jr Ntr
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2024 | 4:53 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్‏కు ఇప్పుడు ప్రపంచమంతా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ హీరో.. ఇప్పుడు దేవర సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకున్నారు. ఎన్టీఆర్ అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ చూసి భారతీయులు, విదేశీయులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే.. బాలనటుడిగానే ఎన్టీఆర్ వెండితెరపై అద్భుతం సృష్టించాడు. తన నటనా సామర్థ్యం గురించి చిన్నప్పుడే తెలుగు ప్రేక్షకులకు తెలిసేలా చేశాడు. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ఆయన రాముడిగా నటించిన తొలి చిత్రం రామాయణం. ఎంఎస్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ అప్పట్లో సినీప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అప్పట్లో చిన్నారులకు మంచి వినోదాన్ని పంచింది. ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. రామాయణం సినిమాలో తారక్ తో పాటు ఎంతో మంది చిన్నారులు నటించారు. వాళ్లందరినీ అదుపు చేయడం అంటే మాములు విషంయ కాదు.

అప్పట్లో ఈ మూవీ షూటింగ్ సమయంలో చిన్నారులు ఒక్కరు కూడా కుదురుగా కూర్చొనేవారు కాదట.. ఇక ఇందులో రాముడి పాత్రలో నటించిన ఎన్టీఆర్ అల్లరి గురించి చెప్పక్కర్లేదు. తెరవెనుక విపరీతమైన గోల చేసి అందరినీ ఆటపట్టించేవాడట. బాణాలు విరగొట్టాడట. శివ ధనుర్భంగం సీన్ కోసం ప్రత్యేకంగా కనిపించాలని టేకుతో ఓ విల్లును తయారు చేయించారట డైరెక్టర్ గుణశేఖర్. అలాగే మరో డూప్లికేట్ విల్లును కూడా తయారు చేయించి పక్కన పెట్టారట. అయితే ఓవైపు షూటింగ్ పనులు జరుగుతుంటే మరోవైపు ఎన్టీఆర్ మిగతా పిల్లలతో కలిసి డూప్లికేట్ విల్లును పైకి లేపారట. ఆ తర్వాత టేకు విల్లును కూడా పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తూ దానిని విరగొట్టారట. దీంతో డైరెక్టర్ గుణశేఖర్ తారక్ పై కోప్పడడంతో ‘నేను ఈ సినిమా చేయను. వెళ్లిపోతాను’ అంటూ గోల చేశారట ఎన్టీఆర్.

ఇక రామాయణం షూటింగ్ సెట్ లో అందరి పిల్లలను ఆటపట్టించేవాడట తారక్. అరణ్యవాసం సీన్ కోసం చిత్రయూనిట్ మొత్తం చేలకుడి వెళ్లగా.. అక్కడ విపరీతమైన చలిలో పిల్లలందరూ చొక్కాలు లేకుండా నటించడానికి వణికిపోతుంటే తారక్ వాళ్లను బాణాలతో పొడుస్తూ తెగ ఏడిపించేవాడట. రామాయణం సినిమాతో చిన్నప్పుడే వెండితెరపై రాముడిగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు తారక్.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..